సందీప్‌కే భారీ సపోర్ట్..అయినా క్లారిటీ ఇచ్చాడు

| Edited By: Srinu

Jul 08, 2019 | 7:36 PM

మొదటి సినిమా ‘శివ’తో రామ్‌గోపాల్ వర్మ తెలుగు సినిమా చరిత్రలో ఎటువంటి సెన్సేషన్‌ క్రియేట్ చేశాడో..సందీప్ రెడ్డి వంగా కూడా తన తొలి మూవీ ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌పై చెరిగిపోని ముద్ర వేశాడు. ఈ మూవీనే బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ మూవీ వసూళ్ల సునామి సృష్టిస్తోంది. కానీ ఈ సినిమాపై విమర్శల తీవ్రత దానికి దీటుగానే ఉంది. సినిమాలో హీరోయిన్‌ని, హీరో కొట్టడంతో కొంతమంది […]

సందీప్‌కే భారీ సపోర్ట్..అయినా క్లారిటీ ఇచ్చాడు
Follow us on

మొదటి సినిమా ‘శివ’తో రామ్‌గోపాల్ వర్మ తెలుగు సినిమా చరిత్రలో ఎటువంటి సెన్సేషన్‌ క్రియేట్ చేశాడో..సందీప్ రెడ్డి వంగా కూడా తన తొలి మూవీ ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌పై చెరిగిపోని ముద్ర వేశాడు. ఈ మూవీనే బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ మూవీ వసూళ్ల సునామి సృష్టిస్తోంది. కానీ ఈ సినిమాపై విమర్శల తీవ్రత దానికి దీటుగానే ఉంది. సినిమాలో హీరోయిన్‌ని, హీరో కొట్టడంతో కొంతమంది క్రిటిక్స్ విమర్శల దాడి చేశారు.

వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్క్యూలో “ఇద్దరి ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు కొట్టుకునే స్వేచ్ఛ ఉండకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది” అనే కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై పలువురు హీరోయిన్స్, సామాజిక కార్యకర్తలు భగ్గుమన్నారు. సమంత, చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ, గుత్తా జ్యాల లాంటి మన తెలుగు ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా ఈ విషయంలో చాలా మంది నెటిజన్లు సందీప్ రెడ్డికే మద్దతు తెలిపారు. #WeSupportSundeepReddy అనే హ్యష్ ట్యాగ్ నిన్నంతా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

అయినా కూడా సందీప్ రెడ్డి వంగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. ‘నన్ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓ అమ్మాయి, అబ్బాయి డీప్ లవ్‌లో ఉన్నప్పుడు తమలోని అన్ని ఎమోషన్స్ బయటపెట్టకపోతే ఆ బంధంలో తీవ్రత ఉండదని అన్నాను. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అని వెల్లడించారు.