RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రీక్లైమాక్స్‏లో జక్కన్న చేసిన మార్పు ఇదే.. అలా చేయకుండా ఉంటే కథ వేరేలా ఉండేదే..

|

Mar 19, 2024 | 4:29 PM

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హాలీవుడ్ మేకర్స్‏ను మెప్పించి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా వైపు ప్రపంచం దృష్టిని తిప్పేశాడు జక్కన్న. ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గట్లేదు. మొన్న జరిగిన ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి నాటు నాటు ఫీవర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రీక్లైమాక్స్‏లో జక్కన్న చేసిన మార్పు ఇదే.. అలా చేయకుండా ఉంటే కథ వేరేలా ఉండేదే..
Rajamouli
Follow us on

ఆర్ఆర్ఆర్.. తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వేదికపై చాటిచెప్పిన సినిమా. ఇందులోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊర్రూతలుగించింది. అంతేకాదు.. ఇదే పాట ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హాలీవుడ్ మేకర్స్‏ను మెప్పించి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా వైపు ప్రపంచం దృష్టిని తిప్పేశాడు జక్కన్న. ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గట్లేదు. మొన్న జరిగిన ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి నాటు నాటు ఫీవర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తన సతీమణితో కలిసి అక్కడకు వెళ్లారు. జక్కన్న దంపతులకు జపాన్ లో ఘన స్వాగతం లభించింది. అక్కడి సినీ ప్రియుల అభిమానం చూసి పొంగిపోయాడు. అనంతరం అక్కడ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో పాల్గొన్న జక్కన్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా కనిపించిన బ్రిటిష్ అమ్మాయి జెన్నీ పాత్రలో కొన్ని మార్పులు చేయాలనుకున్నామని అన్నారు. భీమ్, జెన్నీ కాంబోలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. నిడివి కారణంగా ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని అన్నారు రాజమౌళి. ఈ సినిమాలో తారక్ జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా మోరీస్ కనిపించింది.

రాజమౌళీ మాట్లాడుతూ. “భీమ్ ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ అతడిని కలుస్తుంది.. అతడిని జైలు నుంచి తప్పించడానికి సాయం చేయాలనుకుంటుంది. దీంతో ఆమె అంకుల గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా అక్కడ ఉన్న ప్లాన్స్ ను దొంగిలించి తీసుకెళ్లి భీమ్ కు ఇస్తుంది.. అక్కడి నుంచి జెన్నీ వస్తుండగా.. స్కాట్ భార్య జెన్నీని చూస్తుంది. ఆ సమయంలో తన బూట్లకు మట్టి ఉండడంతో అనుమానంతో స్కాట్ కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ జైలు నుంచి పారిపోవడంతో రామ్ ను జైల్లో పెడతారు. దీంతో భీమ్ తిరిగి వచ్చి రామ్ ను తీసుకుని వెళ్లిపోతాడు. ఆ సమయంలో జెన్నీని పావుగా వాడుకుని రామ్, భీమ్ ఇద్దరిని పట్టుకోవాలని భావిస్తాడు స్కాట్. తనను మోసం చేసినందుకు జెన్నీని స్కాట్ చంపేస్తాడు..కానీ విషాదంతో కూడిన కథను తీయాలని అనిపించలేదు. దీంతో మొత్తం క్లైమాక్స్ మార్చేశాం. అందుకే జెన్నీ బతికిపోయింది.. సినిమా హ్యాప్పీగా చూడగలిగారు ” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం జక్కన్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే భీమ్, జెన్నీ పాత్రలకు మరింత స్క్రీన్ స్పేస్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నిడివి కారణంగా కొన్ని సన్నివేశాలు తగ్గించారని తెలుస్తోంది. ఈ సినిమాతో చరణ్, తారక్ క్రేజ్ మరింత పెరిగింది. వీరిద్దరికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.