Karthikeya 3: కార్తీకేయ 3 కచ్చితంగా ఉంటుంది.. పార్ట్ 2ని మించి ఉండేలా ప్లాన్.. డైరెక్టర్ చందూ మొండేటి..

|

Aug 16, 2024 | 6:59 PM

కార్తికేయ 2 చిత్రబృందానికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీకేయ 3 పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ పార్ట్ 3 తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్ 2న మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తాను తెరకెక్కిస్తున్న తండేల్ పూర్తయ్యాక కార్తీకేయ 3 ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Karthikeya 3: కార్తీకేయ 3 కచ్చితంగా ఉంటుంది.. పార్ట్ 2ని మించి ఉండేలా ప్లాన్.. డైరెక్టర్ చందూ మొండేటి..
Karthikeya 2
Follow us on

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 సినిమా పురస్కానికి ఎంపికైంది. దీంతో కార్తికేయ 2 చిత్రబృందానికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీకేయ 3 పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ పార్ట్ 3 తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్ 2న మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తాను తెరకెక్కిస్తున్న తండేల్ పూర్తయ్యాక కార్తీకేయ 3 ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. కార్తీకేయ 2 సినిమాకు జాతీయ అవార్డ్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు హీరో నిఖిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. మన కార్తీకేయ 2 జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగాఉంది. ఆ ఆనందాన్ని మీత పంచుకోవాలనిపించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోవడం.. అలాగే జాతీయ అవార్డుకు ఎంపికవ్వడానికి కారణం చిత్రయూనిట్. నిర్మాతలు, దర్శకుడు చందూ, హీరోయిన్ అనుపమ, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని.. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపారు.

ఈ సినిమాలోని నటీనటులు వారి పాత్రలకు వందశాతం న్యాయం చేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.ఈ సినిమాలో కుమారస్వామి పాత్రలో నిఖిల్ ఒదిగిపోయారు. ముగ్ధ పాత్రలో అనుపమ తన అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇక ఈ సినిమాకే హైలెట్ అయిన పాత్ర డాక్టర్ ధన్వంతి వేద్పాఠక్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.