Prabhas- Dil Raju: ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు అదే జరిగింది: దిల్‌ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదే సమయంలో తనతో కలిసి పనిచేసిన హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Prabhas- Dil Raju: ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు అదే జరిగింది: దిల్‌ రాజు
Dil Raju, Prabhas

Updated on: May 23, 2026 | 3:56 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఫౌజీ, స్పిరిట్, కల్కి2, సలార్ 2 వంట క్రేజీ ప్రాజెక్టులను ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో పాటు మరికొందరు స్టార్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ప్రభాస్ తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేశాడు. ఈశ్వర్ తో హీరోగా అరంగేట్రం చేసిన డార్లింగ్ రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, ఛత్రపతి, పౌర్ణమి, యోగి వంటి మాస్ యాక్షన్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు. ఇదే క్రమంలో అతను నటించిన మరో మాస్ మూవీ మున్నా. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. 2007లో రిలీజైన ఈ సినిమా జస్ట్ యావరేజ్ గా నిలిచింది. అయితే ఇందులో ప్రభాస్ లుక్, ఫైట్స్ అయితే అభిమానులకు తెగ నచ్చేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ప్రభాస్ మా బ్యానర్ లో మొదటిసారి మున్నా సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా కంటే ముందు మేము నిర్మించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథ అద్భుతంగా నచ్చడంతో మున్నా కూడా బ్లాక్బస్టర్ అవుతుందని భావించాం. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను బాగానే నిర్మించాం.’

‘ సినిమా పూర్తై థియేటర్లలో విడుదలైంది. అయితే నేను థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది. అదే విషయాన్ని ప్రభాస్‌ కు చెప్పాలని ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటికే కొన్ని సోర్సెస్ నుంచి మంచి రివ్యూలు రావడంతో ప్రభాస్ తన స్నేహితులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సమయంలోనే నేను వెళ్లగా, ప్రభాస్ నా దగ్గరకు వచ్చి ‘హిట్ కొట్టేశాం’ అని అన్నాడు. దాంతో నేను, ‘ సినిమా అంత పెద్ద హిట్ అవ్వదు. మహా అయితే యావరేజ్ దగ్గర సినిమా ఆగిపోవచ్చు’ అని చెప్పాను. దానికి ప్రభాస్ షాక్ అయ్యి, ‘నాకు తెలిసినంతవరకు సినిమా హిట్ అవుతుంది’ అని అన్నారు. దానికి నేను ‘అలా అయితే అదృష్టమే. కానీ యావరేజ్ కు ఫిక్స్ అయితే బెటర్’ అని చెప్పాను. చివరికి నేను చెప్పినట్లే మున్నా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టకుంది’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు దిల్ రాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us