
సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంటే.. మరికొందరు పూర్తిగా వేరే రంగంలో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేస్తారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఆమెకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారంటే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ చిన్ననాటి ఫొటోలోని ముద్దుల పాప ఎవరో కాదు.. అందాల భామ తాప్సీ. చిన్నప్పటినుంచే చదువుపై ఆసక్తి చూపించిన ఆమె.. ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. అయితే తాప్సీ మనసు మాత్రం మరో ప్రపంచం వైపు లాగేది. మోడలింగ్‌పై ఆసక్తితో ఉద్యోగాన్ని పక్కన పెట్టేసింది.
2008లో గెట్ గార్జియస్ అనే మోడలింగ్ షోలో పాల్గొనడంతో ఆమె కెరీర్‌కు కొత్త మలుపు వచ్చింది. ఆ తర్వాత అందాల పోటీల్లోనూ మెరిసి పలు టైటిల్స్ సొంతం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. మోడలింగ్‌లో వచ్చిన అవకాశాల తర్వాత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడం తాప్సీ కెరీర్‌లో మరో ముఖ్యమైన అంశంగా మారింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ముఖ్యంగా హీరోయిన్ ప్రధానంగా ఉండే కథలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తన కెరీర్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తాప్సీ తనదైన ముద్ర వేసింది. మొదట ఉద్యోగం చేసిన తాప్సీ.. ఆ తర్వాత మోడల్‌గా, హీరోయిన్‌గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన కెరీర్‌ను పెంచుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.