Tollywood: పవన్ ఫ్లాప్ సినిమా స్టోరీతో హిట్ కొట్టిన రవితేజ..! ఆ సినిమా అదేనా.?

|

May 02, 2023 | 5:46 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నారు. వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అనంతమే. కానీ వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా.. ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గని స్టార్ హీరో మాత్రం ఒక్కరే..

Tollywood: పవన్ ఫ్లాప్ సినిమా స్టోరీతో హిట్ కొట్టిన రవితేజ..! ఆ సినిమా అదేనా.?
Ravi Teja
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నారు. వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అనంతమే. కానీ వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా.. ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గని స్టార్ హీరో మాత్రం ఒక్కరే.. ఆయనే పవన్ కళ్యాణ్. ఈ సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్‌లో ఫ్లాప్ సినిమాల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితేనేం వాటితో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానించేవారు కోకొల్లలు. ప్రస్తుతం పవర్ స్టార్ అటు వరుస సినిమాలు.. ఇటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలుగులో ఒక ఫార్ములా ఓ హీరోకు హిట్ సినిమాను ఇవ్వొచ్చు. ఇంకో హీరోకు ఫ్లాప్ చిత్రాన్ని ఇవ్వొచ్చు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు ఫ్లాప్ మూవీని ఇచ్చిన ఓ స్టోరీ.. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చి.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దామా..!

2005లో దర్శకుడు కరుణాకరన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఇందులో శ్రియా, నేహా ఒబెరాయ్ హీరోయిన్లుగా నటించారు. ఇది బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా కూడా సోసోగానే నిలిచింది. కానీ ఈ స్టోరీ ఫార్ములానే రవితేజను ఫ్లాప్‌ల నుంచి బయటపడేసి.. సూపర్ హిట్ అందించింది. ఆ సినిమానే ‘బలుపు’. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రంలో అంజలి, శృతి హాసన్ హీరోయిన్లుగా నిలిచారు. ‘బలుపు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా రూ. 29 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే దాదాపుగా ‘బాలు’ మూవీ మాదిరిగా ఉంటుంది. రెండు సినిమాల్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఒకేలా ఉంటాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే హీరోయిన్లు ఇద్దరూ కూడా చనిపోతారు. కాగా, ‘బాలు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ‘బలుపు’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక బాలు సినిమాకు రైటర్ కోన వెంకట్.. ఆయనే బలుపుకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడం గమనార్హం.