
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, డి-10 డ్యాన్స్ షో విజేత రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యాడు. ఓ యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను లైంగికంగా వేధించాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా డ్యాన్స్ మాస్టర్ రాజును అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన టాలీవుడ్, డ్యాన్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.