Mahesh Babu: మహేష్ సినిమాకోసం ఆ విషయంలో సుకుమార్ సలహాలు తీసుకోనున్న జక్కన్న

|

Jan 29, 2023 | 8:12 AM

ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్.

Mahesh Babu: మహేష్ సినిమాకోసం ఆ విషయంలో సుకుమార్ సలహాలు తీసుకోనున్న జక్కన్న
Mahesh Babu, Rajamouli
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. ఇటీవలే  మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు జక్కన్న. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ జోనర్ లో మహేష్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే స్టైల్ లో ఉంటుందని తెలుస్తోంది. జక్కన్నకు సుకుమార్ దర్శకత్వం వహించిన వన్ నేనొక్కడినే సినిమా అంటే చాలా ఇష్టమని.. అందులో మహేష్ లుక్ అంటే చాలా ఇష్టమని.. హాలీవుడ్ హీరోలా కనిపించాడని గతంలో జరిగిన ఒక ఇంట్రవ్యూలో చెప్పుకొచ్చారు జక్కన్న. ఇప్పుడు ఇదే స్టైల్ లో మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు.