క‌రోనా విరాళాల కోసం వర్చువల్​ డేటింగ్​కు సిద్ధమైన స్టార్ హీరో

|

Apr 07, 2020 | 9:59 PM

కరోనా వల్ల ఇండియాలో లాక్​డౌన్​ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశంలోని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు… రోజువారి కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని సాయం చేసేందుక‌ ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విరాళాలు ప్ర‌క‌టించారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం స‌రికొత్త ప్ర‌యోగంతో విరాళాలు సేక‌రించేందుకు సిద్ధమయ్యాడు. ఓ రెండు సేవాసంస్థలతో ఈ కార్య‌క్ర‌మానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా గివ్ ఇండియా అనే సంస్థ ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 60 వేల […]

క‌రోనా విరాళాల కోసం వర్చువల్​ డేటింగ్​కు సిద్ధమైన స్టార్ హీరో
Follow us on

కరోనా వల్ల ఇండియాలో లాక్​డౌన్​ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశంలోని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు… రోజువారి కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని సాయం చేసేందుక‌ ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విరాళాలు ప్ర‌క‌టించారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం స‌రికొత్త ప్ర‌యోగంతో విరాళాలు సేక‌రించేందుకు సిద్ధమయ్యాడు. ఓ రెండు సేవాసంస్థలతో ఈ కార్య‌క్ర‌మానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా గివ్ ఇండియా అనే సంస్థ ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 60 వేల మంది కార్మికులను గుర్తించింది. వారిని అంద‌రం కలిసి ఆదుకుందామని హీరో అర్జున్ క‌పూర్ పిలుపునిచ్చాడు.

tofankind.org వెబ్​సైట్​లోకి లాగిన్ అయి ఎవరైనా సరే తమకు తోచినంత డొనేష‌న్ ఇవ్వొచ్చని చెప్పాడు అర్జున్. ఇలా ఇచ్చిన వారిలో ఓ ఐదుగురు లక్కీ విన్నర్స్​ను పిక్ చేసి, ఈనెల 11న వారితో వర్చువల్ డేటింగ్​కు వెళతానని పేర్కొన్నాడు. ఆ సమయంలో వారు చెప్పినవి వింటూ, వారితో మాట్లాడుతూ, కలిసి లంచ్ చేస్తానని తెలిపాడు.