‘సరిలేరు నీకెవ్వరు’ స్టోరీ ఇదేనా..?

|

Oct 27, 2019 | 6:16 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో.. జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కథ తాజాగా లీకైంది. చేసింది బయటవారు ఎవరో అనుకుంటే, మీరు పొరబడినట్లే. చిత్రంలోని సీన్స్ గురించి చెప్పింది ప్రముఖ […]

సరిలేరు నీకెవ్వరు స్టోరీ ఇదేనా..?
Follow us on

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో.. జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ కథ తాజాగా లీకైంది. చేసింది బయటవారు ఎవరో అనుకుంటే, మీరు పొరబడినట్లే. చిత్రంలోని సీన్స్ గురించి చెప్పింది ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్..మరో నటుడు సుబ్బరాజు​. కాకపోతే ఇదంతా జస్ట్ సినిమా  ప్రమోషన్‌లో భాగమే. పండగ సందర్భంగా జస్ట్ అలా విషెస్ చెప్పేందుకు ఈ మార్గాన్ని ఎన్నుకుంది టీం.  చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​.. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది.

క్రైమ్ బ్రాంచ్​ కోటి(సుబ్బరాజు), అతడి అసిస్టెంట్​ కిశోర్(వెన్నెల కిశోర్)​ను ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన ఓ రిపోర్టర్..​ సినిమా విశేషాలు అడగ్గా “ట్రైన్ ఎపిసోడ్.. కర్నూలు ఎపిసోడ్.. ఆ తర్వాత సార్(క్రైమ్ బ్రాంచ్​ కోటి) ఎంట్రీ.. ప్రకాశ్ రాజ్, ఆ తర్వాత రష్మిక… రష్మిక వచ్చిన తర్వాత హీరో వస్తారు..” అంటూ సాగుతున్న ఈ వీడియో అలరిస్తోంది. ఈ మధ్యలో డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి వారిని ఆటపట్టిస్తారు. ఇలా సరదాగా సాగుతుంది  వీడియో. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి.. ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రానుందీ చిత్రం.