Yogi Babu: ఎన్నో ఇబ్బందులు పడ్డ.. బంధువులే అవమానించారు.. యోగిబాబు కామెంట్స్

|

Aug 07, 2024 | 1:15 PM

కమెడియన్ గాకెరీర్ ప్రారంభించిన యోగిబాబు. ఆతర్వాత హీరోగా మరి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటులలో ఒకరిగా మారాడు. ఇటీవలే యోగి బాబు హీరోగా తెరకెక్కిన బోడ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన పడిన కష్టాలు తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని యోగిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

Yogi Babu: ఎన్నో ఇబ్బందులు పడ్డ.. బంధువులే అవమానించారు.. యోగిబాబు కామెంట్స్
Yogibabu
Follow us on

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కొంతమంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచలంచలుగా ఎదుగుతూ మంచి స్థానానికి వచ్చినవారు చాలా మంది ఉన్నారు. వారిలో తమిళ్ నటుడు యోగి బాబు ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యోగిబాబు. కమెడియన్ గాకెరీర్ ప్రారంభించిన యోగిబాబు. ఆతర్వాత హీరోగా మరి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటులలో ఒకరిగా మారాడు. ఇటీవలే యోగి బాబు హీరోగా తెరకెక్కిన బోడ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన పడిన కష్టాలు తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని యోగిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎదురయ్యే అవమానాల నుంచి మనం నేర్చుకునే పాఠాలు తక్కువేమీ కాదు. ఇంట్లో పని పాట లేకుండా ఉండటం.. అలా ఉన్నవారిని కుటుంబసభ్యులు తిట్టడం అందరి ఇళ్లలోనూ జరుగుతుంటాయి. కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు తమ కుటుంబంలో దీని వల్ల ఏర్పడే సమస్యల గురించి చెబుతుంటారు. కానీ వీటన్నింటికీ మించి మన సొంత బంధాలు, స్నేహితులు, బయట వాళ్లు పెట్టే హింసను మాటల్లో వర్ణించలేము. ఉద్యోగం లేక, సినిమా అవకాశాలు లేక, ఏం చేయాలో తోచక మీ స్నేహితులకు చెబితే వారు సమాధానం చెప్పరు, సలహాలు ఇవ్వరు. చాలా అవమానిస్తుంటారు.. అలాంటి కొన్ని విషయాలు జీవితంలో మనల్ని ప్రేరేపిస్తాయి. నేను చెప్పగలిగేది ఒక్కటే. చిత్తశుద్ధితో, కఠోర శ్రమతో ఏ పని చేసినా విజయం సాధించవచ్చు.

బిల్డింగ్ సెంటరింగ్ చేయడం, ఏడాది పాటు వాచ్ మెన్ గా నైట్ వర్క్ చేయడం, హ్యుందాయ్ కంపెనీలో పనిచేయడం, సిలిండర్ కంపెనీలో పనిచేయడం, సినిమాల్లోకి వచ్చాక, పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ తో సెట్స్ వేయడం ఇలా రకరకాల పనులు చూశాను. నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి నిలబడ్డాను.. మనం మాట్లాడే మాట ఎవరినైనా ప్రోత్సహించేలా ఉండాలి. ఏం చేసినా ధైర్యంగా ఉండు, ప్రతిదాంట్లో పోరాటం ఉంటుంది. అయితే అలా చూడకుండా గెలుపొందిన విషయాన్ని మాత్రమే మనం చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.