Jabardasth Naresh: రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నా..

జబర్దస్త్ నరేష్ తన కెరీర్ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నాడు. నాగబాబు ప్రోత్సాహం, సుధాకర్, భాస్కర్ మద్దతు తన ఎదుగుదలకు తోడ్పడిందని తెలిపారు. వ్యక్తిగత ఎదుగుదల, సినీ అవకాశాలపై కీలక వివరాలు వెల్లడించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Jabardasth Naresh: రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నా..
Naresh

Updated on: Mar 23, 2026 | 9:23 PM

జబర్దస్త్ నరేష్ తన వృత్తిపరమైన ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, తన అభిప్రాయాలను పంచుకున్నారు. జడ్జ్‌గా నాగబాబు ఉన్నప్పుడు తన స్కిట్‌లకు విశేష ప్రోత్సాహం లభించిందని, అది తనను మరింత మెరుగ్గా పని చేసేలా ప్రేరేపించిందని తెలిపారు. తన సినీ అరంగేట్రం వెనుక సుధాకర్, భాస్కర్ మద్దతు కీలకమని పేర్కొన్నారు. తన కెరీర్‌లో టీమ్ లీడర్‌గా వ్యవహరించడం ఒక తప్పు నిర్ణయమని నరేష్ అంగీకరించారు. స్కిట్‌లు ఎలా చేయాలి, ఎప్పుడు రావాలి, ఎంత వరకు చేయాలి వంటి అవగాహన లేని సమయంలో టీమ్ లీడర్ బాధ్యత తీసుకోవడం వల్ల దాదాపు రెండేళ్లు తన కెరీర్‌లో వెనక్కి వెళ్ళినట్లుగా అనిపించిందని వివరించారు.

కొన్ని మంచి అవకాశాలు చేజారిపోయినప్పుడు బాధపడ్డానని, అయితే అవి మళ్ళీ వస్తాయిలే అని తేలికగా తీసుకున్నానని చెప్పారు. అభిమాన క్షణాలను గుర్తు చేసుకుంటూ, హీరో రవితేజని కలిసినప్పుడు ఆయన తనను దగ్గరకు తీసుకొని ఫోటో తీసుకున్నారని, అది తన జీవితంలో ఒక మధురానుభూతి అని నరేష్ పేర్కొన్నారు. అల్లు అర్జున్, చిరంజీవికి తాను అభిమానినని తెలిపారు. చిరంజీవి స్వయంగా తన సినిమాలో తనను రికమండ్ చేసి అవకాశం ఇచ్చారని, సెట్‌కు వెళ్లినప్పుడు “నరేష్ ఎక్కడ?” అని అడిగి, తనను చూసి “బాగా చేస్తావ్” అని అభినందించారని గుర్తు చేసుకున్నారు.

ఇది చదవండి: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

Follow Us