‘జబర్దస్త్’ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వలా..కమెడియన్ సంచలన కామెంట్

|

Mar 15, 2020 | 4:56 PM

‘జబర్దస్త్’ గురించి బయటవ్యక్తులు రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ ఆ షో ద్వారా ప్రజలకు పరిచయమై, స్టార్ డమ్ సంపాదించుకుని..కార్లు, ప్లాట్లు సంపాదించుకున్న కమెడియన్ షోపై నెగటీవ్‌ కామెంట్స్ చెయ్యడం చర్చనీయాంశమైంది. అంతేకాదు జీవితంలో ‘జబర్దస్త్’ కానీ, ఈటీవీకి కానీ రానని తెగేసి చెప్పాడు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు కిర్రాక్ ఆర్పీ.  దీంతో అందితే కాళ్లు, అందకపోతే కాళ్లు పట్టుకునే టైఫ్ ఇతడు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మల్లెమాల సంస్థ ‘జబర్దస్త్’ లాంటి […]

జబర్దస్త్ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వలా..కమెడియన్ సంచలన కామెంట్
Follow us on

‘జబర్దస్త్’ గురించి బయటవ్యక్తులు రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ ఆ షో ద్వారా ప్రజలకు పరిచయమై, స్టార్ డమ్ సంపాదించుకుని..కార్లు, ప్లాట్లు సంపాదించుకున్న కమెడియన్ షోపై నెగటీవ్‌ కామెంట్స్ చెయ్యడం చర్చనీయాంశమైంది. అంతేకాదు జీవితంలో ‘జబర్దస్త్’ కానీ, ఈటీవీకి కానీ రానని తెగేసి చెప్పాడు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు కిర్రాక్ ఆర్పీ.  దీంతో అందితే కాళ్లు, అందకపోతే కాళ్లు పట్టుకునే టైఫ్ ఇతడు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మల్లెమాల సంస్థ ‘జబర్దస్త్’ లాంటి కార్యక్రమానికి రూపకల్పన చెయ్యకపోతే వీరంతా అసలు బయటకు వచ్చేవారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మరొక షోలో అవకాశం వచ్చి ఉండవచ్చు కానీ జీవితంలో ఎదుగుదలకు కీ రోల్ పోషించిన ‘జబర్దస్త్’‌పై ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని మరికొందరు సీనియర్ కమెడియన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ఓ ప్రైవేట్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన ఆర్పీ..లైఫ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద మాటని..అది ఎక్కడపడితే అక్కడ వాడకూడదని సూచించాడు. కేవలం ‘జబర్దస్త్’ అనేది అవసరం, అవకాశాల మధ్య ఒప్పందమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రోడ్డు మీద వెళుతున్న తనను పిలిచి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని చెప్పాడు.