Tollywood: అమ్మ బాబోయ్.. కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

|

Sep 06, 2024 | 8:14 PM

2009 లో విడుదలైన కిక్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇందులోని అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉండేలా డైరెక్టర్ డిజైన్ చేశారు. సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..;? తను ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది.

Tollywood: అమ్మ బాబోయ్.. కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
Aasheekaa Bathija
Follow us on

మాస్ మహారాజ రవితేజ కిక్ ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రవితేజకు లైఫ్‌లో మర్చిపోలేని విజయాన్ని అందించింది. 2009 లో విడుదలైన ఈ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించింది. తమిళ్ యాక్టర్ శ్యామ్ సినిమాలో కీ రోల్ చేశాడు. ఈ మూవీ తర్వాత అతనిపేరు కిక్ శ్యామ్‌గా మారింది.  అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. కిక్ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండేలా డైరెక్టర్ సినిమా తీశారు. ఇక ఈ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన యువతి గుర్తుందా..? మూవీలో కనిపించేది కొద్ది సేపు అయినా తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సినిమాలో ముందు రవితేజను ఇష్టపడ్డ అమ్మాయిగా మెప్పించిన ఈ చిన్నదాని పేరు ఆషీకా బతిజా. కిక్ తర్వాత ఈ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. మూవీ రిలీజ్ తర్వాత ఈ బ్యూటీ చదువుపై ఫోకస్  పెట్టి లండన్ వెళ్ళిందట.  ఆ తర్వాత మోడలింగ్ రంగంలో స్థిరపడిపోయింది.

అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా. ఆ డీటేల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాం. తన పెళ్లి చేసుకుని ఫారిన్‌లోనే సెటిల్ అయింది. అలాగే ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మ పాత్ర కూడా పోషిస్తుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్. తన ఫోటోలు, వీడియోలు తరుచుగా షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబందించిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.