Tollywood: ఓరి నాయనో.. చంద్రముఖిలో వడివేలు భార్య ఇలా మారిపోయింది ఏంటి..?

|

Jul 31, 2024 | 11:53 AM

హారర్ జోనర్‌లొ ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ చంద్రముఖిని కొట్టే మూవీ కష్టమే అని చెప్పాలి. ఈ సినిమా కథ, కథనం, నటీనటల యాక్టింగ్ ఓ లెవల్‌లో ఉంటుంది. అయితే మూవీలో వడివేలు భార్య పాత్ర చేసిన నటీమణి.. మీకు గుర్తుందా..? తను ఇప్పుడు ఎలా ఉందంటే..?

Tollywood: ఓరి నాయనో.. చంద్రముఖిలో వడివేలు భార్య ఇలా మారిపోయింది ఏంటి..?
Suvarna Varghese
Follow us on

రజినీకాంత్ ఈ పేరే ఒక బ్రాండ్.. ఆయన అలా జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చినా చాలు ఫ్యాన్స్ విజిల్స్ వేసి.. క్లాప్స్ కొడతారు. ఎందుకంటే ఆయన వాక్‌లో కూడా ఓ స్టైల్ ఉంటుంది. ఆయన సినిమాలు అంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. కెరీర్‌లో అభిమానులు కాలర్ ఎగరేసేలా ఎన్నో సినిమాలు చేశారు రజినీకాంత్. వాటిలో ‘చంద్రముఖి’ గురించి అందరూ ఎక్కువగా చెబుతూ ఉంటారు. పి. వాసు డైరెక్షన్‌లో 2005లో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో ఈ సినిమా డబ్ కాగా జనాలు థియేటర్లకు ఎగబడి వెళ్లారు. వాస్తవానికి ఈ మూవీ మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయుకు రీమేక్‌గా తెరకెక్కింది.

మూవీలో నయనతార, జ్యోతిక, ప్రభు.. ఇలా అందరి పాత్రలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక సినిమాలో వడివేలు కామెడీ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. రజినీకాంత్, వడివేలు.. ఆయన భార్య పాత్ర సెంట్రిక్‌గా చేసిన కామెడీ సీన్లు నవ్వులు పూయించాయి. అయితే మూవీలో వడివేలు భార్యగా నటీమణి మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఎలా ఛేంజ్ అయిందో తెలిస్తే.. నివ్వెరపోవాల్సిందే. ఆ నటి అసలు పేరు ‘సోర్నా మాథ్యూ’. గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ..  చంద్రముఖి మూవీతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఈమెకు.. తర్వాత మంచి ఆఫర్స్ రాలేదనే చెప్పాలి. కొన్నాళ్లు అడపా దడపా సినిమాలు చేసిన ఆమె.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.

అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తూ.. అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ ఆమె లుక్‌లో చాలా ఛేంజ్ వచ్చింది. బహుశా ఏజ్ పెరగడం వల్ల కావొచ్చు. బయట ఆమెను చూస్తే.. చంద్రముఖిలో నటించింది ఈమె అంటే నమ్మడం కష్టమే. అయితే గ్లామర్ విషయంలో మాత్రం నో ఛేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి