Pooja hegde: ఆ స్టార్ హీరోతో పూజా డీప్ లిప్ లాక్.. అమ్మడి రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు షాక్

పూజా హెగ్డే ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇటీవల చాలా సినిమాల నుంచి తప్పుకుంది. ఎట్టకేలకు పూజా రెండు సినిమాలు అంగీకరించింది. ఈ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో పూజా తిరిగి బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు గేరు మార్చేసింది. గ్లామర్ డోస్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది.

Pooja hegde: ఆ స్టార్ హీరోతో పూజా డీప్ లిప్ లాక్.. అమ్మడి రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు షాక్
Pooja Hegde

Updated on: Jan 28, 2025 | 3:35 PM

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తుంది. ఈ అమ్మడు చేసిన సినిమాలని వరుసగా డిజాస్టర్ గా నిలిచాయి. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ పూజా క్రేజ్ మాత్రం అక్కడా తగ్గలేదు. తెలుగులో తక్కువ సమయంలోనే తోపు హీరోయిన్ గా మారింది ఈ పొడుగుకాళ్ల సుందరి. నాగ చైతన్య ఒక లైలా కోసం సినిమాతో మొదలు పెట్టి చివరిగా వచ్చిన రాదే శ్యామ్ సినిమా వరకు ఈ అమ్మడు తన నటనతో అందంతో కవ్వించింది. కాగా ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. అయితే గతకొంతకాలంగా ఈ అమ్మడికి కాలం కలిసి రావడం లేదు. చేసిన సినిమాలన్నీ దారుణంగా నిరాశపరిచాయి. ఒక్క భాషలో కాదు ఆమె నటించిన అన్ని బాషల సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు యంగ్ బ్యూటీస్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. దాంతో ఇప్పుడు పూజా కూడా స్పీడ్ పెంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా హిందీలో ఓ సినిమాను లైనప్ చేసింది. అంతేకాదు ఈసారి డోస్ పెంచి తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ అమ్మడు తన గ్లామర్ తో కురాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. కాగా ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమాలో రెచ్చిపోయిందని తెలుస్తుంది. పూజగా తమిళ్ లో దళపతి విజయ్ సరసన ఓ సినిమా చేస్తుంది.

అలాగే హిందీలో షాహిద్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. దేవా అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో పూజా రొమాంటిక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందని తెలుస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో రొమాంటిక్ సీన్స్, బోల్డ్ డైలాగ్స్, అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటం పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో లిప్ లాక్స్ కు కొదవే లేదు అని తెలుస్తుంది. సినిమాలో మొత్తంగా ఆరు లిప్ లాక్స్ ఉంటాయని తెలుస్తుంది. అంతే కాదు షాహిద్ క‌పూర్- పూజాహెగ్డే మ‌ధ్య ఈ లిప్ లాక్ సీన్ ఓ రేంజ్ లో ఉండటంతో ఆ సీన్ ను సెన్సార్ బోర్డు తొలగించాలని సూచిందని తెలుస్తుంది. మొత్తానికి పూజా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట. మరి ఈ సినిమా పూజకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

షాహిద్ కపూర్ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.