
సోషల్ మీడియాలో రకరకాల విషయాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రతివారం కొత్త కొత్త ట్రెండ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా 80’స్ ట్రెండ్ నడుస్తుంది. 80వ దశకంలో హీరోలు, హీరోయిన్స్ ఎలా రెడీ అయ్యేవారు. అప్పటి డ్రసింగ్, ఫ్యాషన్ సెన్స్ తో ఫోటోలను ఏఐ టెక్నాలజీతో ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నార్మల్ ఫోటోలను 80′ ట్రెండ్ కు సెట్ అయ్యేలా ప్రాంప్ట్ రాసి ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి సందడి చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలు మాత్రమే కాదు, ప్రజా ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ ట్రెండ్‌లో చేరుతున్నారు.
AI సహాయంతో రెట్రో ఫోటోలను క్రియేట్ చేయడం చాలా సులభం. యూజర్స్ Chat GPT లాంటి AI ఇమేజ్-జనరేషన్ టూల్‌కు ఒక స్పష్టమైన ఫోటోను అప్‌లోడ్ చేసి, ఆ ఫోటోను ’80ల నాటి వాతావరణంలో ఉంచమని దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. అలాగే ఆ ఫోటోని మరింత సహజంగా కనిపించేలా చేయడానికి, వారు ఒత్తుగా ఉండే హెయిర్ స్టైల్, రంగురంగుల డ్రస్సులు, డెనిమ్ జాకెట్లు, ప్రత్యేకమైన యాక్సెసరీలు, వింటేజ్ ఇంటీరియర్స్, 80′ స్ బ్యాక్‌డ్రాప్‌లు, వామ్ లైటింగ్, బ్లర్ టోన్‌లు అలాగే ఫిల్మ్-గ్రెయిన్ ఎఫెక్ట్ వంటి ప్రాంప్ట్ ఇవ్వాలి.
అంతే 80′ స్ రెట్రో స్టైల్ ఫోటో వచ్చేస్తుంది. ఈ ఫోటోలను కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనన్య నాగళ్ళ, కియారా అద్వానీ, శృతి హాసన్, నందిత శ్వేత, ఐశ్వర్య రాజేష్, ప్రణీత సుభాష్, లక్ష్మీ రాయ్ ఇలా చాలా మంది సెలబ్రెటీలు ఈ 80ఫొటోలతో సందడి చేస్తున్నారు.
ప్రాంప్ట్ :
నా ఫేస్ , ఫేస్ షేప్ , స్కిన్ టన్, ఎక్స్ప్రెషన్స్ అలాగే వరిజినల్ ఫేస్ ఉంచుతూ , ఈ ఫోటోను 1980ల నాటి రెట్రో ఫోటోగా మార్చండి. అసలైన 1980ల ఫ్యాషన్‌కు సరిపోయేలా నా బట్టలు, హెయిర్ స్టైల్ అలాగే ఆర్నమెంట్స్ మార్చు. వామ్ అనలాగ్ లైటింగ్, క్లియర్ ఫిల్మ్ గ్రెయిన్, కొద్దిగా మసకబారిన రంగులు, సాఫ్ట్ ఫోకస్ అలాగే నేచురల్ బాడీ షేప్ ని ఉపయోగించు. కేవలం వింటేజ్ ఫిల్టర్‌ను అప్లై చేసినట్లు కాకుండా, ఈ ఫోటో నిజంగా 1980లలో తీసినట్లుగా కనిపించేలా చెయ్యి. స్మార్ట్‌ఫోన్‌లు, లేటెస్ట్ కార్లు అలాగే ప్రస్తుత కాలపు బట్టలు వంటి ఆధునిక వస్తువులను తొలగించండి. మీరు అందించే వివరాలు పెరిగే కొద్దీ, ఫోటో మరింత ఒరిజినల్ గా తీసిన దానిలా ఉంటుంది.
ఐశ్వర్య రాజేష్ ఇన్ స్టా
నందిత ఇన్ స్టా..
ప్రీతీ ముకుందన్
తేజ సజ్జా ఇన్ స్టా గ్రామ్
జనవరి 12న విడుదల టీమ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.