Tollywood: వారెవ్వా.. ఈ క్యూటీని ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే.. అచ్చతెలుగమ్మాయి అయినా తగ్గేదేలే..

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. పైన ఫోటోలో తండ్రి పక్కన కూర్చున్న ఆ చిన్నారి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన అమ్మాయి. ఈరోజు ఆ వయ్యారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా..

Tollywood: వారెవ్వా.. ఈ క్యూటీని ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే.. అచ్చతెలుగమ్మాయి అయినా తగ్గేదేలే..
Actress
Follow us

|

Updated on: Jun 16, 2024 | 4:04 PM

పక్కా తెలుగమ్మాయి.. అయినా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ పాత్రలు కాదు.. కంటెంట్ ముఖ్యమంటూ సైడ్ రోల్స్ సైతం చేసేస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. పైన ఫోటోలో తండ్రి పక్కన కూర్చున్న ఆ చిన్నారి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన అమ్మాయి. ఈరోజు ఆ వయ్యారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. తను మరెవరో కాదు..హీరోయిన్ అంజలి. ఇప్పటికే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్.

కోలీవుడ్ హీరో జీవా సరసన డేర్ సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అంజలి. ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో ఇటు తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత తమిళంలో నటించిన షాపింగ్ మాల్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. షాపింగ్ మాల్ సినిమాతో అంజలికి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. తమిళంలో డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన జర్నీ చిత్రంలో అంజలి సహజ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.

ఇక 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్ సరసన అంజలి నటన అద్భుతమనే చెప్పాలి. ఇందులో సీత పాత్రలో మెప్పించింది. అమాయకపు చూపులు.. కల్లాకపటం లేని అమ్మాయిగా అంజలి నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో ఉండిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అంజలి.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles