Raveena Tandon: నేను అలా చేశానని నాపై రాతలు రాశారు.. ఆవేదన వ్యక్తం చేసిన రవీనా

|

Apr 01, 2024 | 10:22 AM

సెలబ్రెటీలకు ఈ ఫెక్ న్యూస్ లు ఇబ్బంది ఇప్పుడు కాదు.. సోషల్ మీడియా రాకముందు నుంచి ఉంది. ఇప్పటికే చాలా మంది అసత్య ప్రచారాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్‌కి కూడా ఈ విషయంలో ఇబ్బంది ఎదురైంది. తన పరువుకు భంగం కలిగేలా వార్తలు రాశారని తెలిపింది రవీనా.

Raveena Tandon: నేను అలా చేశానని నాపై రాతలు రాశారు.. ఆవేదన వ్యక్తం చేసిన రవీనా
Raveena Tandon
Follow us on

ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఫేక్ న్యూస్ ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఈ ఫెక్ న్యూస్ ల వల్ల సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెలబ్రెటీలకు ఈ ఫెక్ న్యూస్ లు ఇబ్బంది ఇప్పుడు కాదు.. సోషల్ మీడియా రాకముందు నుంచి ఉంది. ఇప్పటికే చాలా మంది అసత్య ప్రచారాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్‌కి కూడా ఈ విషయంలో ఇబ్బంది ఎదురైంది. తన పరువుకు భంగం కలిగేలా వార్తలు రాశారని తెలిపింది రవీనా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన రవీనా ఈ విషయాన్నీ తెలిపింది.

రవీనా టాండన్ 1991లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘పత్తర్ కే ఫూల్’  అనే సినిమాతో ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమె పాపులారిటీ పెరిగింది. తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు ఈ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది.  2022లో విడుదలైన ‘కేజీఎఫ్ 2′ చిత్రంలో రమికా సేన్ పాత్రలో నటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించింది. ఇంత పాపులారిటీ సంపాదించిన రవీనా గతంలో  ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.

1998లో విడుదలైన ‘బడే మితా చోటే మియా’ సినిమా షూటింగ్‌లో రవీనా అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో రవీనా 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. బడే మియా చోటే మియా సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలో ఉన్నాను. అదే సమయంలో నానా పటేకర్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఆ సినిమా కోసం  ముంబైకి వచ్చాను. ఉదయం లేచిచూస్తే  101 డిగ్రీల జ్వరం ఉంది ఎంత ఇబ్బంది కలిగినా షూటింగ్ ఆపలేదు. తర్వాత ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది’ అని రవీనా తెలిపింది.

‘డాక్టర్‌కి ఫోన్ చేసి నా సమస్య చెప్పాను. నేరుగా ఆసుపత్రికి వెళ్లమని చెప్పాడు. నాతో పాటు మీరా కూడా వచ్చింది. ఆ నెలలో నా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ పత్రిక నాపై తప్పుడు వార్తలు రాసింది. నేను డ్రగ్ తీసుకొని.. ఆత్మహత్యకు పాల్పడ్డా అని రాశారు. నేను టిక్ 20 (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్) ఎలా తీసుకున్నానో, ఎలా ఆత్మహత్యకు ప్రయత్నించానో అని కూడా రాశారు’ అని రవీనా తెలిపింది. ’20 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. ఆ తర్వాత షూటింగ్‌కి వచ్చాను. అందరూ నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకుఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగే వారు. వాళ్లందరికీ ఏం జరిగిందో వివరించాను’ అని రవీనా చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.