నేను కూడా నా యూరిన్ తాగాను.. అది ఆరోగ్యానికి మంచిదే అంటున్న హీరోయిన్

సాధారణంగా మనకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళతాం. వారు సూచించిన మందులనే వాడతాం. అయితే కొందరు మాత్రం ఇతర పద్ధతులను పాటిస్తుంటారు. నాటు మందు, పసరు మందు అంటూ ఏవేవో తీసుకుంటారు. ఇవి కొన్ని సార్లు తీవ్ర ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి. అయినా కొందరు వీటినే ఆశ్రయిస్తుంటారు

నేను కూడా నా యూరిన్ తాగాను.. అది ఆరోగ్యానికి మంచిదే అంటున్న హీరోయిన్
Actress

Updated on: May 03, 2025 | 3:27 PM

టాలెంటెడ్ నటుడు పరేష్ రావెల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు పరేష్ రావెల్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో లింగం మామగా అదరగొట్టాడు. పరేష్ రావెల్ తెలుగుతో పాటు హిందీలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. గతకొంతకాలంగా ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు పరేష్ రావెల్. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ ప్రేక్షకులను అవాక్ అయ్యేలా చేశాయి. తాను మూత్రం తాగాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 రోజుల పాటు నా యూరిన్‌ ను బీరులా తాగా అని తెలిపాడు పరేష్.

ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్‌ దేవ్‌గణ్‌ తండ్రి వీరు దేవ్‌గణ్‌ ఇచ్చిన సలహామేరకు నేను నా యూరిన్‌ తాగాను .. ఇలా 15 రోజులు నా యూరిన్ తాగాను దాంతో నా గాయం నయం అయ్యింది. నా ఎక్స్ రే చూసి డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. అని తెలిపారు. అయితే ఇప్పుడు పరేష్ రావెల్ మరో నటి కూడా యూరిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కూడా నా యూరిన్ తాగుతాను అని తెలిపింది. అయితే డాక్టర్స్ మాత్రం యూరిన్ తాగడం మంచిది కాదు అంటున్నారు.

ఆమె ఎవరో కాయూద్ బాలీవుడ్ బ్యూటీ అను అగర్వాల్. 1990లో విడుదలైన ఆషికి సినిమాతో పాపులర్ అయ్యింది ఈ చిన్నది. తాజాగా అను యూరిన్ తాగడం గురించి మాట్లాడుతూ.. యూరిన్ తాగడం అనేది యోగాలో ఓ ముద్ర.. యూరిన్ తాగడం వల్ల మొఖం పై ముడతలు తగ్గుతాయి. చాలా మందికి యూరిన్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలియదు. తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. యూరిన్ తాగ‌డాన్ని ఆమ్రోలి అంటారు నేను కూడా యూరిన్ తాగాను. యూరిన్ లో కొంత తీసుకోవడం మంచిదే.. యూరిన్ తాగడం వల్ల నాకు ఆరోగ్య ప‌రంగా ఎంతో ప్రయోజనం చేకూర్చిందని చెప్పుకొచ్చింది. అలాగే యూరిన్ తాగొద్దు అని డాక్టర్స్ చెప్తారుకదా..? అనే ప్రశ్నకు సైన్స్ 200 ఏళ్ళనాటిది.. యోగ 1000ఏళ్ల నాటిది అని చెప్పుకొచ్చింది అను అగర్వాల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి