Arshad Warsi: సౌత్ సినిమాలపై మరోసారి అర్షద్ వార్సీ కామెంట్స్.. ఈసారి ఏమన్నారంటే..

|

Aug 25, 2024 | 4:52 PM

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు సౌత్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన కల్కి 2898 ఏడీ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అతడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా..

Arshad Warsi: సౌత్ సినిమాలపై మరోసారి అర్షద్ వార్సీ కామెంట్స్.. ఈసారి ఏమన్నారంటే..
Arshad Warsi
Follow us on

కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. అతడి తీరుపై సౌత్ అడియన్స్, సెలబ్రెటీస్ మండిపడుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు, దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫేమస్ కావడానికే అర్షద్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని సీరియస్ అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు సౌత్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన కల్కి 2898 ఏడీ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అతడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా.. అర్షద్ వార్సీ తీరుపై టాలీవుడ్ అడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటౌన్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, శర్వానంద్, మంచు విష్ణు, సిద్ధు జొన్నలగడ్డ వంటి స్టార్స్ ఈ నటుడి వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా గతంలో అర్షద్ వార్సీ సౌత్ సినిమాల గురించి మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీని ‘కేజీఎఫ్’ సినిమా క్రేజ్ గురించి ఓ ప్రశ్న అడిగారు. ఇక సౌత్ ఇండియన్ సినిమాలన్నింటినీ ఒకే స్థాయిలో ఉంటాయని.. ఆ సినిమాల్లో తెలివి ఏమాత్రం ఉండదని పేర్కొన్నాడు. దక్షిణాది చిత్రాలు వినోదాత్మకంగా మాత్రమే ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘మా ఇంట్లో పనిచేసే వాళ్లందరూ కూడా హిందీలో డబ్ అయిన సౌత్ ఇండియన్ సినిమాలను చూస్తారు. అవి అత్యంత వినోదాత్మకంగా ఉంటాయి. రజనీకాంత్ సినిమా అంటే అంత పెద్ద స్టార్ కాబట్టి ఒక కారణం ఉంటుంది. ఆ సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తెలివిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందులో వాహనాలు ఎగురుతాయి, మనుషులు ఎగురుతారు. మీరు కూడా చూడండి.. పాప్ కార్న్ తిని, సినిమా చూసి ఇంటికి వెళ్లొచ్చు అంతే’ అని అర్షద్ వార్సీ అన్నారు. దీంతో ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల మీ పట్ల గౌరవం తగ్గుతుందని.. అర్షద్ కేవలం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాల గురించే మాట్లాడుతుంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

All my servants watch Hindi dubbed south movies. You don’t need much brain to watch them. – Arshad Warsi
byu/raaz9658 inBollyBlindsNGossip

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.