Bigg Boss Telugu 8: తొక్కలో సంచలక్.. మణికంఠ పై రెచ్చిపోయిన ప్రేరణ

|

Sep 17, 2024 | 6:33 PM

తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో విడుదల చేశారు. హౌస్ మేట్స్ మధ్య డిస్కషన్స్, గొడవలు, టాస్క్‌లు గట్టిగానే జరుగుతున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కొత్త ప్రేమ కథ చూపించారు. ముందుగా నిఖిల్, సీత, నైనిక, మణికంఠ కలిసి డిస్కషన్ పెట్టారు.

Bigg Boss Telugu 8: తొక్కలో సంచలక్.. మణికంఠ పై రెచ్చిపోయిన ప్రేరణ
Bigg Boss8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటుకే ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం హౌస్ లో 12మంది మెంబర్స్ ఉన్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో విడుదల చేశారు. హౌస్ మేట్స్ మధ్య డిస్కషన్స్, గొడవలు, టాస్క్‌లు గట్టిగానే జరుగుతున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కొత్త ప్రేమ కథ చూపించారు. ముందుగా నిఖిల్, సీత, నైనిక, మణికంఠ కలిసి డిస్కషన్ పెట్టారు. నిఖిల్, యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నాడని సీత అంటే దానికి నేను నీతో కాకుండా ఎవరితో మాట్లాడాను చెప్పు అని అడిగాడు నిఖిల్. దానికి సీత యష్మి అని చెప్పగానే.. నేను యష్మితో సరిగ్గా మాట్లాడటం లేదు అన్నాడు. దానికి పిలిచి అడుగుదామా అని అనగానే.. సీత యష్మిని పిలిచింది.

నిన్ను ఈయన ఎప్పుడైన ఫ్లర్ట్ చేశాడా.? అని అడిగింది సీత. దానికి యష్మి నేనే చాలాసార్లు కొట్టాను.. ఆయన చాలా సార్లు కొట్టాడు అని చెప్పింది. ఆతర్వాత అక్కడిని వచ్చిన విష్ణు ప్రియా కూడా నిఖిల్ ను నువ్వు యష్మితో చేసేది ఫ్లర్టింగ్ అని అంది. నేను సీతకు తప్ప ఎవరికీ పాడలేదు అని నిఖిల్ అన్నాడు. దానికి యష్మి.. అయితే నువ్వు హ్యాపీ కాదా.? మీరు మీరు చేసుకోండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఆతర్వాత సోనియా పృద్వి దగ్గర కూర్చొని ఏమైంతుంది రా నీకు యష్మికి అని అడగ్గానే ఎందుకు అలా అడుగుతున్నారు అని అన్నాడు. దానికి నీకు ఇష్టమట కదా ఆమె అంటే అని సోనియా అనగానే మనోడు తెగ సిగ్గుపడ్డాడు.  ఆతర్వాత రేషన్ గెలవడానికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో నత్తలా సాగుకు ఒక్కటీ వదలకు అని చెప్పాడు. ఈ టాస్క్ లో కేవలం తలతోనే క్యాబేజీలను నెట్టుకుంటూ.. ఎండింగ్ పాయింట్ కు తీసుకువెళ్లాలి ఎవరైతే ఎక్కువ క్యాబేజీలు తీసుకెళ్తారో వారే విన్నర్ అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు నాగమణికంఠ సంచలక్ గా ఉన్నాడు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ గట్టిగానే పోటీ పడ్డారు. లాస్ట్ లో క్యాబేజీలు మిస్ అయ్యాయి అని ప్రేరణ సంచలక్ ను అడిగింది. దానికి ఎన్ని క్యాబేజిలు ఉన్నాయో అన్నే అని మణికంఠ అనగానే నువ్వెవరివిరా చెప్పడానికి అని రెచ్చిపోయింది ప్రేరణ . దానికి నేను సంచలక్ అని నాగమణికంఠ అంటే తొక్కలో సంచలక్ అంటూ కోపంతో ఊగిపోయింది ప్రేరణ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.