బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్.. శాలినికి సర్‌ప్రైజ్

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్‌లు.. బిగ్ బాస్ హౌస్ ఎప్పుడూ రకరకాల ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంటుంది. తాజాగా ఆదివారం నాటి ఎపిసోడ్ కూడా ఎమోషన్స్, డాన్స్ పర్ఫామెన్స్‌లు అలాగే ఊహించని మలుపులతో సాగింది. అలాగే ఎలిమినేషన్ లోనూ ఊహించని షాక్ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్.. శాలినికి సర్‌ప్రైజ్
Biggboss 10

Updated on: Oct 19, 2026 | 8:43 AM

బిగ్ బాస్ హౌస్ ఎప్పుడూ రకరకాల ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంటుంది. తాజాగా ఆదివారం నాటి ఎపిసోడ్ కూడా ఎమోషన్స్, డాన్స్ పర్ఫామెన్స్‌లు అలాగే ఊహించని మలుపులతో సాగింది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో జరిగిన డ్రామా హౌస్‌లోని సభ్యులతో పాటు ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది. అసలు ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది.? ఆ ఆసక్తికర విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.! ఆదివారం ఎపిసోడ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు ‘సండే ఫండే’ పేరుతో హౌస్‌లో డాన్స్ ఫేస్-ఆఫ్ నిర్వహించారు. దేబ్జానీ -దక్షి, త్రిగుణ్-శివ్, అమన్-ముకేష్ జోడీలు తమ అద్భుతమైన స్టెప్పులతో స్టేజ్‌ను హోరెత్తించారు. ఈ పర్ఫామెన్స్‌లకు రాంప్రసాద్ మార్కులు వేస్తుండగా, నాగార్జున ఫైనల్ మార్కులతో తీర్పునిచ్చారు. ఈ పోటీలో నీతూ, షాలినీ వేసిన స్టెప్పులపై నాగ్ సరదాగా రోహిత్‌ను అభిప్రాయం కోరగా.. “నీతూ మాస్టర్ చాలా బాగా చేశారు” అంటూ కితాబిచ్చాడు. ఇక ఈ డాన్స్ టాస్కులో అమన్ తన మంచి స్టెప్పులతో అందరినీ ఆకట్టుకోగా, చివరికి నరేష్ టీమ్ విజయం సాధించింది.

ఈ ఎపిసోడ్‌లో భాగంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై ఓజీ కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను పంచుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓజీ సభ్యులు ఎక్కువగా దక్షి పేరును ప్రస్తావించారు. కారణం చెబుతూ ఆమె చేతికి మిర్చి ఇచ్చిన నాగార్జున.. ఆమెకు పెద్ద షాకిచ్చారు. దక్షి నేరుగా రెండు వారాల పాటు నామినేట్ అవుతుందని ప్రకటించారు. మరోవైపు, హౌస్‌లో అత్యధిక ఓట్లతో రాంప్రసాద్ స్టార్ ప్లేయర్‌గా నిలిచారు.

చివరికి ఎలిమినేషన్ ఘట్టం అత్యంత భావోద్వేగంగా సాగింది. డేంజర్ జోన్‌లో వర్షిణి, షాలినీ నిలవగా.. ముకేష్ వర్షిణి సేఫ్ కావాలని కోరుకోగా, రోహిత్ మాత్రం షాలినీ సేఫ్ కావాలని మనసారా కోరుకున్నారు. అయితే, చివరకు షాలినీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో రోహిత్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. నేను లేను.. కంట్రోల్ చేసుకోవడానికి నేను లేను కదా.. నువ్వు కప్పుతో రావాలి అంటూ షాలినీ రోహిత్‌ను ఓదార్చడం అందరినీ ఎమోషనల్ చేసింది. స్టేజ్‌ మీదకు వచ్చిన షాలినీ తన జర్నీకి సంబంధించిన ఏవీ (AV) చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ఆట మొత్తం అతనే (రోహిత్) ఉన్నాడు అని షాలినీ అనగా, వీడియోలో కూడా అతనే ఉన్నాడు అంటూ నాగ్ సరదాగా కౌంటర్లు వేశారు. అలాగే, నువ్వు ఉండాల్సిన ప్లేస్‌లో ఎవరు ఉండాలని భావిస్తున్నావని నాగ్ అడగగా.. వంశీ, సుధీర్, వర్షిణి పేర్లను షాలినీ చెప్పారు. వంశీ ఎప్పుడూ నోరుజారలేదని ఆమె చెప్పగా, నాగ్ తనదైన శైలిలో పంచ్ ఇస్తూ.. సర్, మీరు నన్ను రోస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అని షాలినీ నవ్వేశారు. హౌస్‌లోని అందరికీ బై చెప్పి వెళ్ళిపోతుందనుకున్న తరుణంలో బిగ్ బాస్ టీమ్ షాలినీకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. ఆమె నిజంగానే ఎలిమినేట్ అవ్వలేదని, సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నట్లు నాగ్ ప్రకటించారు. ఈ బంపర్ ఆఫర్ విన్న షాలినీ ఒక్కసారిగా ఫుల్ ఖుషీ అయిపోయారు. సీక్రెట్ రూమ్ నుండి తిరిగి హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత షాలినీ తన ఆటతీరును ఎలా మార్చుకుంటుంది.? మిగతా కంటెస్టెంట్లకు ఎలాంటి షాకులు ఇస్తుంది? అనేది వేచి చూడాలి.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us