Bigg Boss 10 Telugu : తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి చైత్ర బయటకు.. ఒక్కొక్కరికి ఆట నేర్పిస్తున్న త్రిగుణ్..

బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈసారి త్రిగుణ్ టార్గెట్ చేయడంతో అడియన్స్ దృష్టిలో రోహిత్ హీరో అయిపోతున్నాడు. ఇక ఎప్పటిలాగే తన నోటి దూలతో జనాలకు చిరాకు పుట్టిస్తున్నాడు త్రిగుణ్. ఇదిలా ఉంటే నాలుగు రోజుల్లోనే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్ చరణ్ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు రెండ్ వికెట్ చైత్ర బయటకు వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

Bigg Boss 10 Telugu : తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి చైత్ర బయటకు.. ఒక్కొక్కరికి ఆట నేర్పిస్తున్న త్రిగుణ్..
Bigg Boss 10 Telugu Updates

Updated on: Sep 12, 2026 | 6:49 AM

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ మొదటి వారంలోనే గొడవలు, తిట్లతోపాటు డబుల్ ఎలిమినేషన్లతో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సాధార‌ణంగా మొదటి వారం ఎలిమినేషన్లు ఉంటాయా ఉండవా అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. కానీ ఈ 10వ సీజన్‌లో మాత్రం బిగ్ బాస్ ఊహించని షాక్‌లు ఇస్తూ కంటెస్టెంట్స్‌ను, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో షాక్ ఇవ్వగా, సెప్టెంబర్ 11 నాటి ఎపిసోడ్‌లో రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా చైత్రా రాయ్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఎపిసోడ్ ప్రారంభంలో, హౌస్ మేట్స్ మద్దతుతో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మరోవైపు ఇంట్లో త్రిగుణ్ తన మైండ్ గేమ్స్ కొనసాగించాడు. అమన్ మసూద్‌ను కలిసి రోహిత్ గురించి నెగెటివ్‌గా చెప్పడానికి ప్రయత్నించాడు. “అగ్నిపరీక్షలో నీపై రోహిత్ అరవడం వల్లే అతనికి హైలైట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్‌వి, ఇతరులు చెప్పేది వినాల్సిన అవసరం లేదు” అంటూ అమన్ బుర్ర తినేశాడు.

అనంతరం బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఇంట్లో ఆడే ప్రతి ఆట కీలకమని, ఇకపై ఎలాంటి టీమ్‌లు ఉండవని, ఎవరి ఆట వాళ్లే ఆడాలని స్పష్టం చేశారు. హౌస్ మేట్స్‌గా మారేందుకు ‘సులువైన దారి (ఈజీ టాస్క్)’, ‘కష్టమైన దారి (హార్డ్ టాస్క్)’ అని రెండు మార్గాలు ఇచ్చారు. సుధీర్, వర్షిణిలు కష్టమైన దారిని ఎంచుకోగా, మిగిలిన వారు ఈజీ టాస్క్‌ వైపు వెళ్లారు. అయితే ఇప్పటికే హై రిస్క్‌లో ఉన్న చైత్రా రాయ్‌కి ఈ టాస్క్‌లో పాల్గొనే అవకాశం బిగ్ బాస్ ఇవ్వలేదు. టాస్క్ ఆడకుండానే ఆమె ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తేలింది.

ఇంట్లో మిగిలిన డ్రామా విషయానికొస్తే.. దేబ్జానీ కెమెరా ముందు ఏడుస్తూ సెంటిమెంట్ పెర్ఫామెన్స్ మొదలుపెట్టగా రోహిత్, షాలిని ఆమెను ఓదార్చారు. త్రిగుణ్ ప్రతి విషయంలోనూ అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ కోచింగ్ ఇవ్వడం కనిపించింది. ఈ క్రమంలో త్రిగుణ్ ప్రవర్తనపై ముఖేష్ గౌడ, సుధీర్, ఝాన్సీల దగ్గర అసహనం వ్యక్తం చేశాడు. “త్రిగుణ్ బయటకు న్యాయంగా మాట్లాడుతున్నట్లు నటిస్తాడు కానీ సమయానికి తగ్గట్టు మాట మారుస్తాడు” అని ముఖేష్ అతని అసలు రంగును బయటపెట్టాడు.

ఆ తర్వాత గిన్నెలు కడిగే విషయంలో రోహిత్‌తో త్రిగుణ్ మళ్లీ గొడవకు దిగాడు. సింక్‌లో కత్తి వేస్తున్నారని, దానివల్ల చేయి తెగే ప్రమాదం ఉందని రోహిత్ వివరించినా త్రిగుణ్ వినకుండా సోది పెట్టాడు. ఇక బిగ్ బాస్ పెట్టిన ‘రన్ రాజా రన్’ ఈజీ టాస్క్‌కి త్రిగుణ్‌ను సంచాలక్‌గా నియమించగా, అక్కడ కూడా అతను తన వంకర నిర్ణయాలు, సలహాలతో రచ్చ చేశాడు. ఈ టాస్క్‌లో చివరికి రామ్ ప్రసాద్ విజేతగా నిలిచాడు. ఎక్కువ ఓట్లు చైత్రకి పడటంతో చైత్ర ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు బిగ్ బాస్. మొదటి వారంలోనే వరుసగా ఇద్దరు ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం మరింత వేడెక్కింది.

Loading...
Unable to load recommendations.
Follow Us