
ప్రభాస్ అంటేనే రికార్డులు..రికార్డులు అంటేనే ప్రభాస్ అన్నట్లుగా తయారయ్యింది ప్రజంట్ పరిస్థితి. బాహుబలి కలెక్షన్ల రికార్డును ఇప్పట్లో చెరిపేయడం అసాధ్యం కాబట్టి ఆ సినిమాను వదిలేసి నాన్-బాహుబలి రికార్డులు లెక్కగడుతున్నారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ మరో క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా భారత సినీ చరిత్రలో నయా రికార్డును సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి మోషన్ పోస్టర్గా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కాగా ఈ సినిమాను జాతకం ఆధారంగా ఉన్న స్టోరీతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తుండగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.