Balakrishna: హీరోగా, విలన్‌గా బాలకృష్ణ.. సొంత డబ్బులతో మూవీ తీస్తే డిజాస్టర్‌గా మిగిలింది.. అదేంటంటే.?

బాలకృష్ణ తన కెరీర్‌లో తొలిసారి నిర్మాతగా మారడమే కాకుండా, హీరో, విలన్‌గా నటించిన మల్టీస్టారర్ చిత్రం సుల్తాన్‌. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కలిసి నటించిన ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Balakrishna: హీరోగా, విలన్‌గా బాలకృష్ణ.. సొంత డబ్బులతో మూవీ తీస్తే డిజాస్టర్‌గా మిగిలింది.. అదేంటంటే.?
Balakrishna

Updated on: Mar 02, 2026 | 12:15 PM

బాలకృష్ణ తన కెరీర్‌లో సుల్తాన్ చిత్రాన్ని ఎంతో నమ్మి చేశారు. ఈ సినిమా నిర్మాణంలో ఆయన భాగమయ్యారు. ఇది బాలకృష్ణ సొంతంగా డబ్బులు పెట్టి నిర్మించిన మొదటి చిత్రం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ముగ్గురు కృష్ణులు నటించారు. బాలకృష్ణతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. బాలయ్య ఇందులో రెండు పాత్రల్లో కనిపించారు. ఒకటి పోలీస్ ఆఫీసర్‌గా, మరొకటి విలన్ సుల్తాన్‌గా. అయితే, ఆయనను విలన్‌గా చూడడానికి అభిమానులు ఇష్టపడలేదు.

సమరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో బాలకృష్ణ సుల్తాన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా, కృష్ణంరాజు సీబీఐ ఆఫీసర్‌గా నటించారు. నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు రాగా, బాలయ్య స్వయంగా డబ్బులు పెట్టి సమర్పకుడిగా వ్యవహరించారు. ఓ రకంగా బాలకృష్ణ నిర్మాతగా మారిన తొలి చిత్రంగా దీన్ని చెప్పవచ్చు. అండమాన్ దీవుల్లో ముగ్గురు కృష్ణులపై ప్రత్యేకంగా ఒక పాటను కూడా చిత్రీకరించారు.

1999 మే 27న విడుదలైన సుల్తాన్ చిత్రం ప్రేక్షకులను, ముఖ్యంగా బాలయ్యను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం మొదట అనుకున్న కథలో వచ్చిన మార్పులు. కృష్ణ, కృష్ణంరాజుల ఎంట్రీతో పరుచూరి బ్రదర్స్ కథలో మార్పులు చేశారు. క్లైమాక్స్‌లో కృష్ణంరాజు పాత్ర చనిపోవడం రెబల్ స్టార్ అభిమానులకు నచ్చలేదు. ఈ కారణాల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. సొంత డబ్బులు పెట్టినా చివరికి డిజాస్టర్‌గా మిగిలింది.

Follow Us