అబ్బబ్బ.. ఏం వయ్యారం.. ఈ సొగసరి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ క్రష్.. ఎవరో గుర్తుపట్టారా.!

|

May 25, 2024 | 4:43 PM

ఒకప్పుడు గ్లామర్‌కు దూరంగా ఉంటూ.. కేవలం యాక్టింగ్ స్కిల్స్‌తో ఫేం తెచ్చుకున్నారు ఎందరో హీరోయిన్లు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. నటనతో ఓవర్‌నైట్ సూపర్‌స్టార్‌లు కావడం కంటే.. గ్లామర్ షోతోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంటున్నారు కొందరు హీరోయిన్లు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

అబ్బబ్బ.. ఏం వయ్యారం.. ఈ సొగసరి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ క్రష్.. ఎవరో గుర్తుపట్టారా.!
Actress
Follow us on

ఒకప్పుడు గ్లామర్‌కు దూరంగా ఉంటూ.. కేవలం యాక్టింగ్ స్కిల్స్‌తో ఫేం తెచ్చుకున్నారు ఎందరో హీరోయిన్లు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. నటనతో ఓవర్‌నైట్ సూపర్‌స్టార్‌లు కావడం కంటే.. గ్లామర్ షోతోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంటున్నారు కొందరు హీరోయిన్లు. లిప్‌లాక్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, బికినీ లాంటి కురచ దుస్తులకు కూడా నో చెప్పట్లేదు ఈకాలంలో కొందరు నటీమణులు. యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ఇందుకు ఉదాహరణ. అంతకముందు సినిమాలకు ఆమెకు రాని గుర్తింపు.. ఒక్క యానిమల్‌ మూవీతో ఓవర్‌నైట్‌లో నేషనల్ క్రష్‌గా మారింది. ఇక ఇప్పుడు ఇదే కోవలోకి వస్తుంది ఈ బ్యూటీ కూడా. చూడటానికి సాదాసీదాగా.. పద్దతిగా కనిపిస్తోన్న ఈ వయ్యారి.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో సెగలు రేపుతోంది. ఇటీవల శ్రీలంకకు వెకేషన్‌కు వెళ్లి బికినీలో హాట్ పోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఈమె చేసింది ఒక్క సినిమానే.. తన నటనతో.. అలాగే హాట్ అండ్ స్టన్నింగ్ లుక్స్‌తో అన్ని ఇండస్ట్రీల కుర్రాళ్ల చూపులను తన వైపునకు తిప్పుకుంది. తెలుగులోనూ సత్తా చాటేందుకు సిద్దమైంది. గ్లామర్ షోకు ఏమాత్రం అడ్డుచెప్పని.. ఈ అందాల భామ మరెవరో కాదు దివ్య భారతి.

తమిళ సినిమా ‘బ్యాచలర్’ మూవీతో ఓవర్ నైట్ కుర్రాళ్లకు హాట్ క్రష్‌గా మారిపోయింది ఈ తమిళ సోయగం. మొదటి సినిమాలోనే ముద్దులు, ఇంటిమేట్ సీన్స్‌తో ఆన్‌స్క్రీన్‌పై సెగలు పుట్టించింది ఈ అమ్మడు. ఆ తర్వాత మదిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజా వంటి చిత్రాలు చేయడంతో పాటు ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది దివ్యభారతి.

ఇక ఇప్పుడు తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన ‘G.O.A.T – Greatest Of All Time’ అనే మూవీలో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు తమిళంలో ‘ఆసై’ అనే చిత్రంలోనూ.. అలాగే లింగం అనే ఓటీటీ మూవీలోనూ లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది దివ్యభారతి. మరి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక.. ఈ అమ్మడు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.!