Pawan Kalyan: జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అభినందనలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

|

Aug 16, 2024 | 7:51 PM

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు సాయంత్రం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాగా కార్తీకేయ 2.. మలయాళీ సినిమాగా ఆట్టమ్ నిలిచాయి. అలాగే కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2లను జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా కాంతార సినిమాగానూ హీరో రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటిగా నిత్యమీనన్ (తిరుచిత్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్) ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది.

Pawan Kalyan: జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అభినందనలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
Pawan Kalyan
Follow us on

జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 70 జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులకు హృదయపూర్వక అభినందనలు. ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగు నుంచి ‘కార్తికేయ-2’ అవార్డు పొందటం సంతోషకరం. ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి , నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ ,టి.జి.విశ్వప్రసాద్ , చిత్ర కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ , చిత్ర బృందానికి అభినందనలు. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనువాద చిత్రాలు కాంతారా, పొన్నియన్ సెల్వన్-1, తిరుచిత్రాంబళం, కేజీఎఫ్-2 వివిధ కేటగిరీల్లో పురస్కారాలు పొందాయి. ఉత్తమ నటి నిత్య మీనన్ , ఉత్తమ నటుడు రిషబ్ శెట్టికి అభినందనలు అని అన్నారు.

సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు జానీ మాస్టర్. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్ కు హృదయపూర్వక అభినందనలు. ఆయన నృత్యాల్లో జానపద, పాశ్చాత్య శైలుల మేళవింపు కనిపిస్తుంది. జానీ’ సినిమా సమయంలో కొరియోగ్రాఫర్ల బృందంలో ఒకరిగా పరిచయం అయ్యారు. నేను చేసిన పలు చిత్రాలకు పని చేశారు. ఆ క్రమంలో కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉన్నారు. జానీ మాస్టర్ సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు. తన నృత్యాలతో ప్రేక్షకుల మెప్పు పొందుతూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు సాయంత్రం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాగా కార్తీకేయ 2.. మలయాళీ సినిమాగా ఆట్టమ్ నిలిచాయి. అలాగే కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2లను జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా కాంతార సినిమాగానూ హీరో రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటిగా నిత్యమీనన్ (తిరుచిత్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్) ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.