Anupama Parameswaran: ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అందుకే సమస్య రాగానే ఆయనకే కాల్ చేస్తా.. అనుపమ..

ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు నెట్టింట సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా తన బ్రేకప్ గురించి బయటపెట్టి అందరికి షాకిచ్చింది. అయితే తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హీరోకు మాత్రమే కాల్ చేస్తానని.. అతడు ఒక స్వీట్ హార్ట్ అని అన్నారు. ఇప్పుడు అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Anupama Parameswaran: ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అందుకే సమస్య రాగానే ఆయనకే కాల్ చేస్తా.. అనుపమ..
Anupama Parameswaran

Updated on: Aug 20, 2026 | 3:43 PM

అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన ఈ అమ్మడు తాజాగా బ్రేకప్ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ తన పాస్ట్ రిలేషన్ షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ అని.. అతడు తనను టార్చర్ చేశాడని చెప్పుకోచ్చింది. ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఒక హీరో బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. కష్ట సమయాలు ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదిస్తారని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఆ హీరో వ్యక్తిత్వాన్ని, పరిశ్రమలో ఆయనకున్న గౌరవాన్ని స్పష్టం చేసింది. మొదట, ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీలో ఎవరినీ సంప్రదించనని, తన మేనేజర్‌ను మాత్రమే సంప్రదిస్తానని అనుపమ పేర్కొన్నారు.

అయితే, ఇంట్లో ఎవరిని పిలుస్తారని అడిగినప్పుడు, తన సోదరుడిని సంప్రదిస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ తనకెంతో ఆప్తుడని, కష్టాల్లో అండగా నిలబడతారని అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేశారు. గతంలో తాను ఆయన చిత్రం కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశానని గుర్తు చేసుకున్నారు. “ఆయనొక స్వీట్‌హార్ట్,” అని దుల్కర్‌ను అభివర్ణిస్తూ, “ఏదైనా సమస్య ఉంటే, నేను ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్‌ను సహాయం కోసం అడగగలను, అవును” అని బలంగా చెప్పారు.

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. సీతారామం సినిమా తర్వాత తెలుగులో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే లక్కీ భాస్కర్ మూవీతో మరో హిట్టు అందుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

 దుల్కర్ సల్మాన్ పోస్ట్..

 ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

Loading...
Unable to load recommendations.
Follow Us