అచ్చుగుద్దినట్టు ‘అమ్మ’లా ఉందే!..కానీ?

| Edited By: Ram Naramaneni

Sep 27, 2019 | 5:37 PM

జయలలిత.. ఈ పేరుకు ఓ చరిష్మా ఉంది. తమిళనాడు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆరుసార్లు తమిళనాడుకు సీఎంగా సేవలందించిన చరిత్ర ఆవిడది. అలాగే.. రాజకీయ నాయకురాలిగా.. కూడా ఆవిడ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. జయలలితకు తమిళనాడులో గుడులు కూడా కట్టి పూజిస్తున్నారు అక్కడి అభిమానులు. అలాంటి లెజెండ్రీ లీడర్‌పై రెండు బయోపిక్‌లు వస్తున్నాయి. ఒకటి.. కంగనా ప్రధాన పాత్రధారురాలిగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా.. మరొకటి డైరెక్టర్ ప్రియదర్శి ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బయోపిక్ […]

అచ్చుగుద్దినట్టు అమ్మలా ఉందే!..కానీ?
Follow us on

జయలలిత.. ఈ పేరుకు ఓ చరిష్మా ఉంది. తమిళనాడు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆరుసార్లు తమిళనాడుకు సీఎంగా సేవలందించిన చరిత్ర ఆవిడది. అలాగే.. రాజకీయ నాయకురాలిగా.. కూడా ఆవిడ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. జయలలితకు తమిళనాడులో గుడులు కూడా కట్టి పూజిస్తున్నారు అక్కడి అభిమానులు. అలాంటి లెజెండ్రీ లీడర్‌పై రెండు బయోపిక్‌లు వస్తున్నాయి. ఒకటి.. కంగనా ప్రధాన పాత్రధారురాలిగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా.. మరొకటి డైరెక్టర్ ప్రియదర్శి ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ అమ్మ జయలలిత పాత్ర పోషిస్తోంది. తాజాగా.. ఈ సినిమాలోని నిత్యామీనన్ లుక్ లాంచ్ చేశారు. ఆ లుక్‌లో.. సేమ్ జయలలితను పోలినట్టుగా.. ఆవిడ కట్టు.. బొట్టు యాజ్‌టీస్ ఆవిడనే మళ్లీ చూసినట్టుగా.. తీర్చిదిద్దారు. ఆ పోస్టర్‌ లుక్‌లో ఉన్నది నిత్యామీననా..? లేక జయలలితనా అన్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. టాలీవుడ్‌లో ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌ వచ్చిన తరువాత నుంచి బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది.