
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఓ ఇంటివాడయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ కో ఓనర్ కావ్య మారన్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. బుధవారం (నవంబర్ 11) గ్రీస్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా పెళ్లి వేడుక అనంతరం స్వయంగా అనిరుధ్ పెళ్లి ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. వధువు కావ్యతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ మై వన్స్ ఇన్ లైఫ్ టైమ్.. ఫర్ ఏ లైఫ్ టైమ్’ అంటూ క్రేజీ క్యాప్షణ్ ఇచ్చాడు అనిరుధ్. తన పోస్ట్ కు లవ్ ఎమోజీ కూడా జత చేశాడు. ప్రస్తుతం కావ్య- అనిరుధ్ ల పెళ్లి ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా గ్రీస్‌లో బీచ్ వెడ్డింగ్‌లు ఎలాగైతే ఘనంగా జరుపుకుంటారో, అదే విధంగా అనిరుధ్, కావ్య మారన్‌ల వివాహం కూడా చాలా వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కలానిధి మారన్ , అనిరుధ్ కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. అలాగే రజనీకాంత్, లతా రజనీకాంత్, ఎం.కె. స్టాలిన్, దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ సహా పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వివాహం తర్వాత నవంబర్ 21న చెన్నైలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ విందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు వెళ్లనున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి