Allu Sirish: అందుకే మా సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్

|

Jul 31, 2024 | 4:56 PM

"బడ్డీ" సినిమా రిలీజ్ ముందు వేసిన షోస్ కు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, పిల్లలు, పెద్దలు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. నేను కూడా వారితో కలిసే సినిమా చూశాను. మేము ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్స్ వారికి బాగా నచ్చుతున్నాయి.

Allu Sirish: అందుకే మా సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్
Allu Sirish
Follow us on

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కే.ఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “బడ్డీ” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా తక్కువ టికెట్ రేట్లతో మీ ముందుకు ఆగస్టు 2న వస్తోంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి తప్పక చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎంతో లవ్, హార్డ్ వర్క్ తో “బడ్డీ” సినిమా చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను. అన్నారు.

హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ – “బడ్డీ” రిలీజ్ కోసం మేమంతా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ ఎప్పుడు అని నేను మా డైరెక్టర్ ను రెగ్యులర్ అడిగేదాన్ని. ఆయన త్వరలోనే అంటూ రిప్లై ఇచ్చేవారు. “బడ్డీ” మీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. నాకు ఇది ఫస్ట్ మూవీ. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా రిలీజ్ ముందు వేసిన షోస్ కు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, పిల్లలు, పెద్దలు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. నేను కూడా వారితో కలిసే సినిమా చూశాను. మేము ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్స్ వారికి బాగా నచ్చుతున్నాయి. టికెట్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది సెకండ్ వీక్ థియేటర్స్ కు వెళ్తున్నారు. అందుకే “బడ్డీ” సినిమాకు సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టాం. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్స్ తో మాట్లాడి మా ప్రొడ్యూసర్ టికెట్ రేట్లు తగ్గించారు. అందుకు జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను సెకండ్ హీరో అనుకోవచ్చు. టెడ్డీ బేర్ ఫస్ట్ హీరో. తను చేసే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా చేశా. యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కు సరైన లాజిక్ కూడా ఉంటుంది. “బడ్డీ”లో టెడ్డీ బేర్ సినిమాలు బాగా చూస్తుంటంది. తను అందరు హీరోల ఫ్యాన్. అందుకే కొన్ని ఫేమస్ డైలాగ్స్ పెట్టాం. ఆగస్టు 2న థియేటర్స్ కు వెళ్లండి. “బడ్డీ” మీ అందరినీ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి