Allu Arjun’s Pushpa Update: కాస్టింగ్‌ పేమెంట్ల కోసమే రూ.60 కోట్లు అట.. ఎక్కడా తగ్గని పుష్ప మేకర్స్

|

Jan 25, 2021 | 10:16 PM

కెరీర్‌లో ఫస్ట్ ఇండస్ట్రీ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్న బన్నీ నెక్ట్స్ మూవీతో మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ తన ఫేవరెట్ డైరెక్టర్‌, బెస్ట్ ఫ్రెండ్‌ సుకుమార్‌తో కలిసి పుష్ప సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌...

Allu Arjun’s Pushpa Update: కాస్టింగ్‌ పేమెంట్ల కోసమే రూ.60 కోట్లు అట.. ఎక్కడా తగ్గని పుష్ప మేకర్స్
Follow us on

కెరీర్‌లో ఫస్ట్ ఇండస్ట్రీ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్న బన్నీ నెక్ట్స్ మూవీతో మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ తన ఫేవరెట్ డైరెక్టర్‌, బెస్ట్ ఫ్రెండ్‌ సుకుమార్‌తో కలిసి పుష్ప సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. ఫుల్ మాస్‌ లుక్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికే వందకోట్ల వసూళ్లు సాధించిన బన్నీ… సినిమాల బడ్జెట్‌ విషయంలో మాత్రం ఆ మార్క్‌ను ఇంకా రీచ్‌ అవ్వలేదు. అయితే పుష్ప సినిమా బడ్జెట్‌ వంద కోట్లకు పై మాటే అన్న టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావటం.. దాదాపు పది భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో… పుష్ప కోసం భారీ బడ్జెట్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్‌.

బిగ్ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్టింగ్‌ పేమెంట్ల కోసమే 60 కోట్లకు పైగా అవుతున్నాయన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్‌.. ఇక మేజర్‌ పార్ట్ ను ఫారెస్ట్ ఏరియాలో షూట్‌ చేస్తుండటంతో అక్కడ సెట్స్‌.. షూట్‌ కోసం కూడా భారీగానే ఖర్చవుతుందట.. అన్ని చూసుకుంటే సినిమా బడ్జెట్‌ 120 కోట్లకు పైగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. బన్నీ మార్కెట్‌కు ఆ మాత్రం వసూళ్లు పెద్దగా కష్టం కాకపోయినా.. తొలిసారి అంత భారీ బడ్జెట్‌ సినిమా చేస్తుడటం స్పెషలే అంటున్నారు ఫ్యాన్స్.

Also Read:

తెలంగాణలోని ఆ ఊరంతా వనవాసానికి వెళ్లింది.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Wine shop theft: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో దొంగల హల్‌చల్..‌ అర్ధరాత్రి వైన్‌షాప్‌లో లూటీ