
అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున వందో సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హీరోగా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న నాగార్జున ఇటీవల సహాయక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి హిట్స్ అందుకున్న నాగ్ ఇటీవల సహాయక పాత్రలు, విలన్ పాత్రలు చేసి కూడా మెప్పించారు. ధనుష్ నటించిన కుబేర సినిమాలో సపోర్టింగ్ రోల్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించి అలరించారు నాగ్. ఇక ఇప్పుడు ఆయన కెరీర్ లో 100వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 99 సినిమాలతో అలరించిన నాగార్జున ఇప్పుడు 100వ సినిమాకోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నాగ్.
ఇక ఈ సినిమా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగ్ కెరీర్ లో 100వ సినిమా.. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది. నాగార్జున 100వ సినిమాకు లాటరీ కింగ్ అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ్ కోసం రంగంలోకి ఓ స్టార్ హీరోయిన్ తీసుకురానున్నారని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ టబు.
అయితే ఈ సినిమాలో టబు విలన్ పాత్రలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. గతంలో నాగ్ కు జోడీగా నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే వంటి సినిమాల్లో నటించింది. అలాగే సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది టబు. అప్పట్లో ఈ ఇద్దరి జోడీగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నాగ్, టబు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దాదాపు 27ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటించనున్నారు నాగ్. టబు ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న స్లమ్ డాగ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది టబు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి