Sunny Leone: నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు.. నేను ఎలా ముందుకెళ్లాలి..

|

Aug 07, 2024 | 8:05 AM

అశ్లీల సినిమాల్లో స్టార్ అయిన తర్వాత ఆమె దాన్ని వదిలేసి బాలీవుడ్ వైపు అడుగులేసింది. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత సన్నీలియోన్ నీలి చిత్రాల్లో నటించడం మానేసింది. అయినప్పటికీ, కొంతమంది సన్నీ లియోన్‌ను శృంగార తారగానే చూస్తున్నారు. దీనిపై ఆమె, మరోసారి స్పందించింది. ఇప్పటికీ తనను ఒకప్పటి నీలి తారగా ప్రేక్షకులు చూడటం పట్ల నటి మనస్తాపానికి గురైంది సన్నీలియోన్.

Sunny Leone: నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు.. నేను ఎలా ముందుకెళ్లాలి..
Sunny Leone
Follow us on

ఇతర రంగాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్నహీరోయిన్స్చాలా మంది ఉన్నారు. డాక్టర్స్, లాయర్లు ఇలా వేరు వేరు వృత్తులనుంచి వచ్చిన వారు ఉన్నారు. అలాగే క్రేజీ హీరోయిన్ సన్నీ లియోన్. గతంలో సన్నీలియోన్ శృంగార వీడియోలు, సినిమాలు చేసింది. అశ్లీల సినిమాల్లో స్టార్ అయిన తర్వాత ఆమె దాన్ని వదిలేసి బాలీవుడ్ వైపు అడుగులేసింది. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత సన్నీలియోన్ నీలి చిత్రాల్లో నటించడం మానేసింది. అయినప్పటికీ, కొంతమంది సన్నీ లియోన్‌ను శృంగార తారగానే చూస్తున్నారు. దీనిపై ఆమె, మరోసారి స్పందించింది. ఇప్పటికీ తనను ఒకప్పటి నీలి తారగా ప్రేక్షకులు చూడటం పట్ల నటి మనస్తాపానికి గురైంది సన్నీలియోన్.

తాజాగా సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమె ఇమేజ్‌ గురించి పై ఓ ప్రశ్న ఎదురైంది. సన్నీ లియోన్‌ను ఆమె మునుపటి అశ్లీల చిత్రాల ద్వారా ప్రజలు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు. అది మీకు ఎలా అనిపించిందని అడిగారు. ఈ ప్రశ్న సన్నీలియోన్‌ చెప్పిన సమాధానం షాకింగ్ గా అనిపించింది. ‘మనం నేటికీ దాని గురించి మాట్లాడుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. బాలీవుడ్‌కి వచ్చి 13 ఏళ్లు అయ్యింది. పాతవి పోనివ్వండి. మేరే మరిచిపోకుంటే మేం ఎలా ముందుకు వెళ్తాం.? ముందుకు వెళ్లేందుకు ఇదే సరైన సమయం’ అని సన్నీలియోన్ పేర్కొంది. సన్నీ లియోన్‌ని ఆ రోజుల గురించి అడిగితే చిరాకు పడుతుందని అర్ధమవుతోంది.

హిందీ బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఇండియన్ సినిమాల్లోకి సన్నీ లియోన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ‘జిస్మ్ 2’ బాలీవుడ్‌లో సన్నీలియోన్ నటించిన తొలి చిత్రం. ఆ తర్వాత ‘జాక్‌పాట్’, ‘రాగిణి ఎంఎంఎస్ 2’ వంటి సినిమాలు కూడా సన్నీలియోన్‌కి పేరు తెచ్చిపెట్టాయి. సన్నీలియోన్ చాలా సినిమాల్లో ఐటమ్ డ్యాన్స్ చేసి ఫేమస్ అయింది. రియాల్టీ షోలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయింది. తెలుగులో ఈ చిన్నది కరెంట్ తీగ, అలాగే జిన్నా సినిమాల్లో నటించింది. అలాగే గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో 56 మిలియన్ వరకూ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.