Shruti Haasan: అతను నా క్లాస్ మేట్.. చాలా ఏళ్లు కలిసే చదువుకున్నాం.. ఆ హ్యాండ్సమ్ హీరోపై శ్రుతి హాసన్ కామెంట్స్

శ్రుతి హాసన్ ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తోంది. సలార్, కూలీ సినిమాల్లో ఈ అమ్మడి అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. కాగా తాజాగా ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్రుతి. ఇప్పుడవి నెట్టింట వైరలవుతున్నాయి.

Shruti Haasan: అతను నా క్లాస్ మేట్.. చాలా ఏళ్లు కలిసే చదువుకున్నాం.. ఆ హ్యాండ్సమ్ హీరోపై శ్రుతి హాసన్ కామెంట్స్
Actress Shruti Haasan

Updated on: Mar 25, 2026 | 9:10 AM

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతి హాసన్. మొదట్లో కొన్ని అపజయాలు ఎదురైనా ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకుంది. కేవలం కథానాయకిగానే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా  పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటోంది. తద్వారా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఈ మధ్యన పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ హీరోయిన్ గా మారిపోయింది శ్రుతి హాసన్. గతేడాది కూలీ సినిమాలో కనిపించిన ఆమె ఇప్పుడు మొత్తం మూడు సినిమాల్లో నటిస్తోంది. ది ట్రైన్, ఆకాశంలో ఒక తార, సలార్ 2: ది శౌర్యాంగ పర్వం సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రుతి హాసన్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన అప్ డేట్స్ ను అందులో షేర్ చేసుకుంటుంది. అలా ఇటీవల ఒక సందర్భంలో తన స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంది శ్రుతి. అందులో భాగంగా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిది.

‘ దుల్కర్‌ సల్మాన్‌, నేను బాల్యంలో చెన్నైలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. రెండు ప్రముఖ పాఠశాలల్లో  మా విద్యాభ్యాసం జరిగింది. ఆ సమయంలో మేము తరచూ కలుసుకునేవారం. దుల్కర్ నన్ను సోంబి అని పిలిచేవాడు. అప్పట్లో విద్యార్థులతో కలిసి నేను సోంబి పాటను పాడాను. ఆ తర్వాతనే దుల్కర్‌ సల్మాన్‌ నన్ను సోంబి అని పిలవడం మొదలు పెట్టాడు. మాతో కలిసి చదివిన విద్యార్థులకు నేను కమలహాసన్‌ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు. కానీ నా పేరు తెలియదు’ అని అప్పటి విషయాలను గుర్తు తెచ్చుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రుతి హాసన్. తెలుగుతో పాటు
 తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us