
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అలాగే మరో పవర్ ఫుల్ పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్స్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ కళ్యాణ్, రానాకు సంబంధించిన టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లాయి.
వచ్చేనెలతో భీమ్లానాయక్ షూటింగు పార్టు కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ నటించనుంది. తాజాగా సంయుక్త ఈ సినిమాలో నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన భీమ్లానాయక్ సినిమాను విడుదల చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :