Priya Prakash Varrier: ఆ హీరో అంటే విపరీతమైన ఇష్టం అంటున్న వింక్ బ్యూటీ.. ఇంతకు ఆయన ఎవరంటే

|

Oct 15, 2022 | 5:51 PM

ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కన్ను కొట్టే సన్నివేశంలో ప్రియా చాలా క్యూట్ గా చేసింది. దాంతో ఓవర్ నైట్ లోనే ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. ఆ సీన్ ను కొంతమంది ట్రోల్ కూడా చేశారు. రకరకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Priya Prakash Varrier: ఆ హీరో అంటే విపరీతమైన ఇష్టం అంటున్న వింక్ బ్యూటీ.. ఇంతకు ఆయన ఎవరంటే
Priya Prakash Varrier
Follow us on

ప్రియవారియర్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో ఈ చిన్నది చాలా పాపులర్ అయ్యింది. ఒరు ఆధార్ లవ్ మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ప్రియా. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కన్ను కొట్టే సన్నివేశంలో ప్రియా చాలా క్యూట్ గా చేసింది. దాంతో ఓవర్ నైట్ లోనే ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. ఆ సీన్ ను కొంతమంది ట్రోల్ కూడా చేశారు. రకరకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా  పలు అవకాశాలను అందుకున్నప్పటికీ ఈమెకు అనుకున్న స్థాయిలో హిట్ సినిమాలు పడలేదు. తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆ తర్వాత తేజ సర్జ తో కలిసి ఓ సినిమా చేసింది. కానీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట చెలరేగిపోతోంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హీరో ధనుష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది ఈ భామ

తాజాగా దీనిపై మీడియా ప్రశ్నించగా.. తనకుధనుష్ అంటే చాలా ఇష్టమని. ఆయన సినిమాలన్నా.. ఆయన నటన అన్న విపరీతమైన ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ధనుష్ అంటే పిచ్చి అని ఆయన పక్కన నటించాలని కోరిక తనలో బలంగా ఉందని, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా, అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ప్రియా..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.