నచ్చినవాడు దొరికితే 70 ఏళ్లు వచ్చినా రెండో పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు తెలుగు, కన్నడ చిత్రపరిశ్రమల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన సీనియర్ నటి ప్రేమ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, విడాకులు, రెండో పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

నచ్చినవాడు దొరికితే 70 ఏళ్లు వచ్చినా రెండో పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress

Updated on: Sep 15, 2026 | 9:27 AM

కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన నటి ప్రేమ.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘దేవి’ చిత్రం కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. భక్తిరస కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమ పోషించిన దేవి పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విజయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ధర్మచక్రం సినిమా, మోహన్‌బాబుతో రాయుడు, జగపతిబాబుతో  చిలక్కొట్టుడులాంటి  చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న ప్రేమ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై గతంలో వచ్చిన వార్తలపై స్పందించారు.

తనకు క్యాన్సర్ వచ్చిందంటూ గతంలో కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయని, అయితే అవన్నీ నిరాధారమైన వార్తలేనని ఆమె స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రేమ తెలిపారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా నటి ప్రేమ పలు విషయాలను వెల్లడించారు. 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును వివాహం చేసుకున్నానని ఆమె తెలిపారు. అయితే ఆతర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు, మనస్పర్థలు ఏర్పడటంతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నారు.

చివరికి పరస్పర అంగీకారంతో 2016లో ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. వివాహ బంధం ముగిసిన తర్వాత ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తున్నట్లు ప్రేమ చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై అడిగిన ప్రశ్నకు ప్రేమ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక తోడు అవసరమని ఆమె అన్నారు. తనను అర్థం చేసుకునే, తన మనసుకు నచ్చే సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటానని ప్రేమ చెప్పినట్లు తెలుస్తుంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని, 70 ఏళ్ల వయసులోనైనా తనకు నచ్చిన వ్యక్తి దొరికితే వివాహం చేసుకోవడంలో తప్పేమీ లేదని ఆమె అన్నారని తెలుస్తుంది. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, సమాజం ఏమనుకుంటుందనే విషయాన్ని పట్టించుకోకుండా తన మనసులోని మాటను చెప్పినట్లు ప్రేమ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Prema

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us