టాలీవుడ్ హీరోయిన్‌కు పెను ప్రమాదం.. వెన్నెముకకు ఫ్రాక్చర్..

నటి నుష్రత్ భరూచాకు ఊహించని ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమయంలో ఆమె ప్రమాదానికి గురైనట్లు ఆమె పీఆర్ టీమ్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటనలో నటి వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె బాలిలోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

టాలీవుడ్ హీరోయిన్‌కు పెను ప్రమాదం.. వెన్నెముకకు ఫ్రాక్చర్..
Actress

Updated on: Oct 03, 2026 | 6:50 AM

నటి నుష్రత్ భరూచాకు ఊహించని ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమయంలో ఆమె ప్రమాదానికి గురైనట్లు ఆమె పీఆర్ టీమ్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటనలో నటి వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె బాలిలోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పీఆర్ టీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నుష్రత్ భరూచా ఓ పని కోసం బాలికి వెళ్లారు. అక్కడే ఆమెకు ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహించిన తర్వాత వెన్నెముకకు సర్జరీ అవసరమని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నుష్రత్‌కు అవసరమైన శస్త్రచికిత్సను ముంబైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆమెను బాలిలో నుంచి ముంబైకి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె పీఆర్ బృందం తెలిపింది.

అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలను మాత్రం నుష్రత్ టీమ్ వెల్లడించలేదు. వెన్నెముకకు గాయం కావడంతో శస్త్రచికిత్స అనంతరం నుష్రత్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆమెకు సంబంధించిన రాబోయే వర్క్ కమిట్‌మెంట్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నుష్రత్ భరూచా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్, రణబీర్ కపూర్ నటిస్తున్న లవ్ రంజన్ ప్రాజెక్ట్‌లోనూ ఆమె నటిస్తున్నారు.

నుష్రత్ ప్రమాదానికి గురైన విషయం బయటకు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం నుష్రత్‌ను ముంబైకి తీసుకువచ్చారని తెలుస్తుంది. అక్కడ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె ఆరోగ్యంపై  అధికారిక అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా నటి నుష్రత్ భరూచా తెలుగులో తాజ్ మహల్ అనే సినిమాలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us