
మమితా బైజు.. ప్రస్తుతం దక్షిణాదిలో ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగుతుంది.ఇటీవల ఆమె నటిస్తోన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కావడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల మమిత హీరోయిన్ గా నటించిన విశ్వనాథం అండ్ సన్స్, బెత్లెహం కుటుంబ యూనిట్ సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలకు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. చాలా ఏళ్ల నుంచి మమితా సినిమాలు చేస్తున్నప్పటికీ
‘ప్రేమలు’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైందీ అందాల తార. ఆ తర్వాత ఆమె నటించిన ‘డ్యూడ్’, ‘కర’, ‘జన నాయగన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బెత్లెహం కుటుంబ యూనిట్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందకుందీ మలయాళీ మద్దుగుమ్మ. ముఖ్యంగా ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ఘనవిజయాన్ని అందుకంది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ఓనం కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 325 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇందులో నివిన్ పౌలీ హీరోయిన్ గా నటించగా, కథానాయిక పాత్రలో మమితా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో హీరోయిన్ మమితా బైజు పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
‘ నా సినీ ప్రయాణంలో ప్రధాన పాత్రలు చేయగలననే నమ్మకం నాకే సమయంలో, డైరెక్టర్ గిరీష్ ఏడీ నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఏమీ తెలియని ఒక సామాన్య వ్యక్తికి ఎవరైనా అండగా నిలబడి ప్రోత్సహిస్తే ఆ వ్యక్తికి సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం, విలువ లభిస్తాయి. గిరీష్ విషయంలో నాకు సరిగ్గా అలాగే అనిపించిందని తెలిపారు. ‘ప్రేమలు’ చిత్రం నుంచి ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ వరకు నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చారాయన. గిరీష్ కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అని మమితా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మమితా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న జై హనుమాన్ సినిమాలో మమితా కథానాయికగా ఎంపికైందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మరిన్నిఅప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.