Keerthy Suresh: సమంత సినిమా రీమేక్‏లో నటించడానికి భయపడటం లేదు.. కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్..

|

Aug 11, 2024 | 8:44 PM

గ్లామరస్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. గతంలో తమిళంలో సమంత, విజయ్ దళపతి నటించిన తేరీ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Keerthy Suresh: సమంత సినిమా రీమేక్‏లో నటించడానికి భయపడటం లేదు.. కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్..
Samantha, Keerthy Suresh
Follow us on

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి.. ఆ తర్వాత మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. గతంలో తమిళంలో సమంత, విజయ్ దళపతి నటించిన తేరీ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ చిత్రంలో తన పాత్రను మరింత చక్కగా తీర్చిదిద్దారని.. అడియన్స్ తప్పకుండా తన పాత్రను ఆదరిస్తారని చెప్పుకొచ్చింది.

తేరీ సినిమాలో సమంత పాత్రను చక్కగా తీర్చిదిద్దారని.. ఆమె ఎంతో అందంగా నటించారని.. సామ్ తన పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయారని చెప్పుకొచ్చింది. నిజానికి రీమేక్ చిత్రాల్లో నటించడం చాలా కష్టమైన పని అని.. అలాంటి చిత్రాల్లో నటించాలంటే తనకు చాలా భయంగా ఉంటుంది.. కానీ బేబీ జాన్ సినిమాలో నటించడానికి తాను ఏమాత్రం భయపడటం లేదని.. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చాలా అద్భుతంగా రాశారని అన్నారు. అలాగే తన పాత్రను స్క్రీన్ పై చక్కగా చూపించనున్నారని.. కథ పరంగా చిత్రయూనిట్ ఎలాంటి మార్పులు చేయలేదని.. తేరీ విడుదలైన ఎనిమిదేళ్ల తర్వాత బేబీజాన్ సినిమాను రూపొందిస్తున్నారని.. ఇప్పుడు పరిస్తితులకు అనుగుణంగా మార్పులు చేశారని..హిందీ మార్కెట్ కు కావాల్సిన విధంగా బేబీ జాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.

కీర్తి సురేష్ నటిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో వామికా గబ్బి కీలకపాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి కాలీస్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇంటెన్స్ యాక్షన్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.