Emergency Trailer: ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఆద్యంతం ఆసక్తికరంగా ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్..

|

Aug 14, 2024 | 7:04 PM

ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ట్రైలర్‌లో ఆమె నటన చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ నటనకు గాను కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.. కంగనా రనౌత్ ఇప్పటికే నాలుగు సార్లు జాతీయ అవార్డును అందుకుంది. ‘ఎమర్జెన్సీ’ సినిమాలో తన నటనకు మళ్లీ జాతీయ అవార్డు వస్తుందని

Emergency Trailer: ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఆద్యంతం ఆసక్తికరంగా ఎమర్జెన్సీ ట్రైలర్..
Emergency Trailer
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ ప్రచారాన్ని ప్రారంభించారు మేకర్స్. ఈరోజు (ఆగస్టు 14) ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ట్రైలర్‌లో ఆమె నటన చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ నటనకు గాను కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.. కంగనా రనౌత్ ఇప్పటికే నాలుగు సార్లు జాతీయ అవార్డును అందుకుంది. ‘ఎమర్జెన్సీ’ సినిమాలో తన నటనకు మళ్లీ జాతీయ అవార్డు వస్తుందని.. అంతగా ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఒదిగిపోయిందంటున్నారు.. ఈ చిత్రానికి కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది. ప్రస్తుతం కంగనా ఆశలన్ని ఈ సినిమాపైనే ఉన్నాయి. చాలా రోజులుగా ఈ మూవీపై మంచి బజ్ నెలకొంది.

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ‘ఎమర్జెన్సీ’ సినిమా ముందే విడుదలై ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ఈ సినిమాలో నటించారు. ఈ ట్రైలర్‌కు కంగనా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

కంగనా రనౌత్ ఇప్పుడు ఎంపీగా ఫుల్ టైమ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ‘ఎమర్జెన్సీ’ సినిమా కూడా రాజకీయాల కథ ఉంది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజకీయాల కారణంగా ఈ సినిమా కాస్త వివాదాలు సృష్టించే అవకాశం కూడా ఉంది. మరి రిలీజ్ తర్వాత జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.