Kalki 2898 AD: కల్కిలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ.. 5 నిమిషాల సీన్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే..

|

Jun 30, 2024 | 10:26 AM

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. భారీ తారగణంతోపాటు ఊహించని ట్విస్టులు, పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు నాగ్ అశ్విన్. ప్రధాన తారాగణంతోపాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కెవి అతిథి పాత్రలు పోషించారు.

Kalki 2898 AD: కల్కిలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ.. 5 నిమిషాల సీన్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే..
Vijay Deverakonda
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.298.5 కోట్లు రాబట్టింది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ యాక్టింగ్ అద్భుతమని.. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారతీయ సినిమా స్థాయిని హాలీవుడ్ మించిపోయేలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. భారీ తారగణంతోపాటు ఊహించని ట్విస్టులు, పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు నాగ్ అశ్విన్. ప్రధాన తారాగణంతోపాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కెవి అతిథి పాత్రలు పోషించారు.

వీరందరి గెస్ట్ రోల్స్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. కల్కి మూవీలో చివరిలో ఐదు నిమిషాలపాటు కనిపిస్తాడు విజయ్. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు విజయ్ దేవరకొండ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడని.. అందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. అలాగే కల్కి సెకండ్ పార్టులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్స్ ఉండనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో అతిథులుగా కనిపించినందుకు చాలా మంది స్టార్స్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. మృణాల్ ఠాకూర్, రాజమౌళి సహా మిగతా నటీనటులు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు ప్రభాస్ రూ.80 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక దీపికా 20 కోట్లు, అమితాబ్ 20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. త్వరలోనే కల్కి పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.