Venkatesh: తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన వెంకటేష్, మైత్రి మూవీ మేకర్స్

|

Sep 06, 2024 | 7:15 PM

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నిత్యావసరాలను అందించాలని వరద బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డు లేనివారికి ఆధార్‌ కార్డు ఆధారంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.. మరోవైపు తెలంగాణలోనూ వరదలు ముంచెత్తాయి.

Venkatesh: తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన వెంకటేష్, మైత్రి మూవీ మేకర్స్
Tollywood
Follow us on

విజయవాడ వాసులను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో ఆహారం, తాగునీరు లేక వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నిత్యావసరాలను అందించాలని వరద బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డు లేనివారికి ఆధార్‌ కార్డు ఆధారంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.. మరోవైపు తెలంగాణలోనూ వరదలు ముంచెత్తాయి. ఖమ్మంలో వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజలు ప్రాణాలు అరచేత్తో పట్టుకు జీవించారు. ఇప్పటికి కొన్ని కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. ఆహరం దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇక వరద భాదితులను ఆదుకునేందుకు సినిమా తారలు ముందుకు వస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయక నిధులకు భారీగా విరాళాలు ఇస్తున్నారు . ఇప్పటికే చాలా మంది విరాళాలు ప్రకటించగా.. తాజాగా హీరో వెంకటేష్ కూడా రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఆయన రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 50లక్షలు విరాళం  ప్రకటించారు.

ఇక ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారంటే..

1. జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

2. మహేష్ బాబు రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

3. చిరంజీవి రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

4. అల్లు అర్జున్ రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

5. ప్రభాస్ రూ.1 కోటి ( ఆంధ్రప్రదేశ్), రూ. 1కోటి ( తెలంగాణ)

6. అశ్విని దత్ రూ. 25 లక్షలు ( విజయవాడ )

7. సిద్దూ జొన్నలగడ్డ రూ. 15 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 15 లక్షలు ( తెలంగాణ)

6. విశ్వక్ సేన్ రూ. 5 లక్షలు (ఆంధ్రప్రదేశ్)

7. నటి అనన్య నాగళ్ళ రూ. 2.5 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 2.5 లక్షలు( తెలంగాణ)

8  విశ్వక్ సేన్ రూ. 5 లక్షలు ( తెలంగాణ )

9. బాలకృష్ణ  రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

10. పవన్ కళ్యాణ్ రూ.1 కోటి ( ఆంధ్రప్రదేశ్) వీటితో పాటు ఏపీలోని 400ల పంచాయితీలకు రూ. 1 లక్ష, రూ. 1కోటి ( తెలంగాణ)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.