నేను 150ఏళ్లు ఖచ్చితంగా బ్రతుకుతా.. నన్ను సీఎంను ఆ చేస్తే ఆ సీక్రెట్ చెప్తా.. స్టార్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆయన ఓ స్టార్ నటుడు, ఆయన భార్య , కూతురు కూడా ఇండస్ట్రీలో స్టార్ నటీమణులు.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు ఆయన. తాజాగా ఈ స్టార్ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాను ఖచ్చితంగా 150ఏళ్లు బతుకుతానని చెప్పి షాక్ ఇచ్చాడు.. అంతే కాదు తనను సీఎం చేయాలనీ చెప్పుకొచ్చాడు.

నేను 150ఏళ్లు ఖచ్చితంగా బ్రతుకుతా.. నన్ను సీఎంను ఆ చేస్తే ఆ సీక్రెట్ చెప్తా.. స్టార్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tollywood Actor

Updated on: Jun 04, 2025 | 3:11 PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 ఏళ్లు బ్రతకడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది. కరోనా తర్వాత ఎవరు.. ఎందుకు చనిపోతున్నారో కూడా అర్ధం కావడంలేదు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ మధ్య ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోతున్నారు. ఇదిలా ఉంటే మనిషి 150ఏళ్లు ఎలా బ్రతకాలో తనకు తెలుసు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ఆ సీక్రెట్ కూడా తాను చెప్పాలంటే తనను సీఎం చేయాలని చెప్పుకొచ్చాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఒకప్పుడు హీరోగా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శరత్ కుమార్. ప్రస్తుతం ఆయన సహాయక పాత్రలు, కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ పేక్షకులను ఆకట్టుకుంటున్నారు శరత్ కుమార్.

శరత్ కుమార్ భార్య రాధికా శరత్ కుమార్ కూడా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా సినిమాల్లో హీరోయిన్ గా.. విలన్ గా నటిస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనిషి జీవిత కాలం గురించి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడున్న రోజుల్లో 60 ఏళ్లు బ్రతకడం చాలా కష్టం అని జనాలు అభిప్రాయానికి వచ్చేశారు. ఈ సందర్భంలో శరత్ కుమార్ మాట్లాడుతూ.. తాను 150ఏళ్లు  ఖచ్చితంగా బ్రతుకుతానని అన్నారు. ఒకవేళ 2026లో తనను సీఎం చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తానని చెప్పుకొచ్చారు శరత్ కుమార్. శరత్ కుమార్ కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద జోక్ చేశారు… అసలు మిమ్మల్ని ఎందుకు సీఎం చేయాలి.? బ్రతికి ఒకరికి తలనొప్పిగా మారె బదులు పోవడమే బెటర్.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది నువ్వు 145 ఏళ్లు బ్రతికిన తర్వాత అడుగు అప్పుడు చూద్దాం అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.