సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే.. ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

మెగా కుటుంబంలో మరో శుభకార్యం సందడి నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 5న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే.. ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Sai Dharam Tej

Updated on: Nov 09, 2026 | 10:14 AM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కిరణ్మయిని ఆయన వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యం, చదువు, వృత్తి, ఆస్తిపాస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. కిరణ్మయి కుటుంబ నేపథ్యానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త అని, దేశవ్యాప్తంగా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొంతమంది నిర్మాతలకు ఆయన ఫైనాన్షియర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వ్యాపార రంగంలో ఆయనకు మంచి గుర్తింపు ఉందని, భారీ ఆస్తులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాలేదు. అయితే ఆమె ఉన్నత విద్యను అభ్యసించారని, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారని తెలుస్తుంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నప్పటికీ ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్మయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే మెగా కుటుంబంలో పలువురు హీరోలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ వివాహంతో మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకానుంది. కిరణ్మయి కూడా ఈ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టబోతుండటంతో మెగా అభిమానుల్లో ఈ పెళ్లిపై ఆసక్తి పెరిగింది. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో కాబోయే జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్, కిరణ్మయి వివాహం డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి వేదిక ఎక్కడనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వివాహానికి మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్న సాయి ధరమ్ తేజ్, మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us