సీనియర్ యాక్టర్‌ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన ప్రకాశ్​రాజ్..​

|

Mar 15, 2020 | 2:48 PM

సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ యాక్టింగ్ స్థాయి వేరు. స్థానం వేరు. ఆయన ఒకసారి మేకప్ వేశారంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం కూడా చేసేస్తారంతే. అందుకే భాషా బేధాలు లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మేరునగధీరుడిగా రాణిస్తున్నారు. అయితే ఆయన పొగరున్న నటుడు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. దిల్ రాజు ఒక సమయంలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక పాలిటిక్స్‌లోనూ యాక్టీవ్‌గా ఉన్న ప్రకాశ్ రాజ్, సేవా కార్యక్రమాలలోనూ తన మార్క్ చూయిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని […]

సీనియర్ యాక్టర్‌ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన ప్రకాశ్​రాజ్..​
Follow us on

సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ యాక్టింగ్ స్థాయి వేరు. స్థానం వేరు. ఆయన ఒకసారి మేకప్ వేశారంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం కూడా చేసేస్తారంతే. అందుకే భాషా బేధాలు లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మేరునగధీరుడిగా రాణిస్తున్నారు. అయితే ఆయన పొగరున్న నటుడు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. దిల్ రాజు ఒక సమయంలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇక పాలిటిక్స్‌లోనూ యాక్టీవ్‌గా ఉన్న ప్రకాశ్ రాజ్, సేవా కార్యక్రమాలలోనూ తన మార్క్ చూయిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోదండరెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాశ్ రాజ్..అక్కడ భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేయిస్తున్నారు. తాజాగా ఈ సీనియర్ నటుడి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో ఓ సీనియర్ నటుడు ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యాడట. విషయం తెలుసుకున్న ప్రకాశ్ రాజ్..సదరు నటుడ్ని పిలిపించి రూ. 50 లక్షలు ఇచ్చి పంపించారట. ఆ తర్వాత ఒక్కరూపాయి కూడా తిరిగి ఆశించలేదట. ఈ విషయాన్ని నటుడు రాజా రవీంద్ర ఇటీవల బయటకు రివీల్ చేశారు. అంతేకాదు తన పెద్దకూతురి పెళ్లికి పిలిచి సాయం చేసి, తిరిగి రూపాయి ఆశించని వ్యక్తి  ప్రకాశ్ రాజ్ అని ఎమోషనల్ అయ్యారు రాజా రవీంద్ర.