వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందుతో...

వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

Updated on: Nov 01, 2020 | 4:16 PM

సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందుతో 31-10-2020 ఉదయం హైదరాబాద్ లోని హోటల్ దస్ పల్లలో 10.55 నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఫిదా’, ‘మిస్టర్ మజ్ను’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘రణరంగం’ సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు రాజా. పలు చిత్రాల్లో నటిస్తూనే వెబ్​ సిరీస్​ల్లోనూ కీలకపాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

Also Read : “నా లైఫ్ గురించి వదిలేయండి.. మీ జీవితాలు చక్క దిద్దుకోండి”

 

Loading...
Unable to load recommendations.
Follow Us