పెళ్లి చేసుకున్న పూనమ్​ పాండే

|

Sep 11, 2020 | 11:46 PM

పూనమ్ పాండే పేరు చెబితే చాలు. సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతంది.  హాట్ ఫోటోలు, హీటెక్కించే స్టేట్మంట్లతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

పెళ్లి చేసుకున్న పూనమ్​ పాండే
Follow us on

పూనమ్ పాండే పేరు చెబితే చాలు. సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతంది.  హాట్ ఫోటోలు, హీటెక్కించే స్టేట్మంట్లతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భామ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తోన్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహమాడింది. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో పంచుకుంది. ‘నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నా’ అంటూ కామెంట్  పెట్టింది. =

మోడలింగ్ రంగంలో కెరీర్​ స్టార్ట్ చేసిన పూనమ్.. ‘నషా’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వివాదాస్పద కామెంట్లతతో తరచూ వార్తల్లో నిలిచేది. ఇటీవల జులై నెలలో సామ్​తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ భామ తాజాగా పెళ్లి పీటలెక్కింది.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం